అశోక్ గజపతిరాజుపైకి దూసుకెళ్లిన శివసేన ఎంపీలు

Ashok-Gaikwadపార్లమెంట్‌ సాక్షిగా శివసేన ఎంపీలు వీరంగం సృష్టించారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజుతో శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించారు. వీరికి కేంద్రమంత్రి అనంత్‌గీతె కూడా మద్దతుగా వెళ్లారు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విమానయాన సంస్థల నిషేధం అంశంపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత రవీంద్రగైక్వాడ్‌ మాట్లాడిన అనంతరం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతుండగా గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదావేశారు. సభవాయిదా పడిన వెంటనే శివసేన ఎంపీలు ఆయన్ను చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తించారు. వీరిలో కేంద్ర మంత్రి, శివసేన ఎంపీ అనంత్‌గీతె కూడా ఉన్నారు. వెంటనే స్పందించిన సహచర మంత్రులు స్మృతి ఇరానీ, అహ్లూవాలియాలు గీతెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. తెదేపా ఎంపీలు కూడా అశోక్‌గజపతిరాజుకు మద్దతుగా అక్కడకు వెళ్లారు. వివాదం ముదరుతోందని గమనించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెంటనే అశోక్‌గజపతిరాజు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ అశోకగజపతిరాజు, రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy