అసలు సిసలు ఆమ్ ఆద్మీ

aam
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత నిజంగానే ఆమ్ ఆద్మీ. ఢిల్లీకి ముఖ్యమంత్రి కాక ముందు అయిన తరువాత ఆయన వ్యవహారశైలీలో ఎలాంటి మార్పూ లేదు.దేశ రాజకీయాలను లీడింగ్ పార్టీలు కాంగ్రెస్, బీజెపీలు రెండూ దేశాన్ని శాసిస్తున్నాయన్న సిగ్నల్ దేశవ్యాప్తంగా పంపించారు. జనలోక్ పాల్ బిల్లు పాస్ చేయకుండా, తన చేత రాజీనామా చేయించిన ఘనత ఆ రెండు పార్టీలకే చెందుతుందని బహిరంగంగా ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలిపి ప్రధాన పార్టీలను ఠారెత్తిస్తున్న కేజ్రీవాల్ పై ఓ కథనం………

దేశ రాజకీయాలను తన వైపుకు తిప్పుకుని ప్రభంజనం సృష్టించిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సాదాసీదాగానే ఉంటున్నారు. వ్యాపార దిగ్గజాలు, ఇండియన్ పాలిటిక్స్ ను తన చుట్టూ తిప్పుకుంటున్న అంబానీలపైనే కేసు వేశాడు. తాను అనుకున్నట్లుగా జన్ లోక్ పాల్ బిల్లును రాకుండా కాంగ్రెస్, బిజెపిలు అడ్డుకున్నాయని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని కేజ్రీవాల్ దేశ ప్రజలకు చెప్పారు. తాను తీసుకుంటున్న నిర్ణయాలు జనాలకు అర్థం కాక పోయినా తాను శిరసావహిస్తాననని సాదాసీదాగా చెప్తున్నారు. అసలు ఆయన రాజకీయాల్లోకి రావడమూ హంగు ఆర్భాటాలు లేకుండానే జరిగింది. పార్టీ ఎన్నికల గుర్తు కూడా సాధారణ జనం నిత్యం వాడేదే. మీడియాలో తన గురించి పాజిటివ్, నెగిటీవ్ ఎలాంటి వార్తా కథనాలు వచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోరు. తాను జనం కోసం వచ్చానని, అందు కోసమే… ఆ ఎజెండా ప్రకారమే నడుచుకుంటానని చెప్తున్నారు.
తాను అనుకున్న పనులు చేయలేక పోతున్నాను కాబ్టటే ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నానని కేజ్రీ మీడియాకు చెప్పారు. ఢిల్లీలో సంపన్న వర్గాలు కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందుతున్నారని, వారి నుండి సరిగ్గా ట్యాక్స్ వసూలు చేస్తే జనాలకు ఇచ్చే సబ్సిడీ మొత్తం సరిపోతుందనే నిజాలను లెక్కలతో సహా చూపించారు. ఇప్పుడు రాజకీయ నాయకుల కన్నా తాను డిఫరెంట్ అని ఆయన మాట తీరు, చేతలే స్పష్టం చేస్తున్నాయని విమర్శకులు సైతం అంటున్నారు. మేధో వర్గంలో, సాధారణ జనంలోనూ ఇప్పుడు చర్చలు మోడి, రాహుల్ కంటే మధ్యతరగతిలో కేజ్రీవాల్ జాడు గురించే ఎక్కువ జరుగుతున్నాయి..

ఎన్నికల్లో జనాలను మభ్య పెట్టే పార్టీల కంటే వాస్తవాలను చెప్పడానికి ఆయన నిర్ధిష్టంగా ముందుకు వెళ్తున్నారు. పార్టీ సింబల్ నుండి చేసే పనుల వరకు అంతా ఆమ్ ఆద్మీనే. ఢిల్లీలో తాను అనుకున్న విధంగా అవినీతి అధికారుల భరతం పడ్తానని చెప్పారు. చెప్పినట్టే బదిలీలు చేశాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కొద్ది రోజుల్లో తాను ఎందుకు కొన్ని పనులు చేయలేదో కూడా స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ప్రైవేటు వారి కంటే అధిక నిధులు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేదని, దానికి పరిష్కారం, ప్రత్యమ్నాయాలను కూడా చూపిస్తున్నారు. ఇంతకు ముందున్న రాకీయాల కంటే భిన్నమైన, ప్రజలకు అవసరమైన రాజకీయాలు చేసి చూపించ వచ్చని కేజ్రీవాల్ నిరూపిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత, అంతకు ముందు తాను వ్యహరిస్తున్న తీరే అందుకు నిదర్శనం. అందుకే కేజ్రీవాల్ నిజంగానే ఆమ్ ఆద్మీ.

బుచ్చన్న, వి6 స్పెషల్ కరస్పాండెంట్

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy