అసెంబ్లీలో జేపీ ఉపన్యాసం: As it is…

jpn

లేటెస్టుగా మనసు మారిన జయ ప్రకాష్ నారాయణ ఈ రో జు అసెంబ్లీ లో తెలంగాణాకు మద్దతుగా బలమైన, సుదీర్ఘ ఉపన్యాసం చేసారు. కొన్ని ముఖ్యమైన పాయింట్స్, ఆయన మాటల్లోనే…

 

“610 జీవో అమలులో లోపాలు కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం

ఉప ముఖ్యమంత్రి సంప్రదాయాన్ని పాటించలేదు

ప్రాంతీయ బోర్డులు రద్దు చేయకుండా ఉంటే చరిత్ర మరోలా ఉండేది

14ఎఫ్ రద్దు చేయాలని నేను ఎప్పుడో చెప్పాను. రోశయ్య పట్టించుకోలేదు. సకాలంలో సరైన విధంగా స్పందించలేదు. అలా జరిగుంటే తెలుగు ప్రజల మధ్య అగాధం వచ్చేది కాదు.

కోట్లాదిమంది విభజనను కోరుకుంటున్నా అదేం లేదని మనం కళ్లు మూసుకుంటే కుదరదు

ఆశలు నెరవేరలేదని వందలాదిమంది యువత ఆత్మహత్య చేసుకున్నారు

విభజన భావన అందరిలోనూ వెళ్లిపోయింది. ఎవరికివారు వాళ్ల ప్రాంత కళ్లద్దాలుపెట్టుకొని చూస్తున్నారు.

బలవంతంగా రాష్ట్రాన్ని కలిపి ఉంచడం సాధ్యం కాదు. అలా కాకుండా కలిపి ఉంచాలనుకుంటే దారుణమైన పరిస్థితులు వస్తాయి.

తెలంగాణపై నిజాయతీగా చర్చించుకోవాల్సిన సమయం ఇది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పుడు అవసరం, అనివార్యం.

గతాన్ని పక్కనబెట్టి భవిష్యత్ గురించి ఆలోచించాలి

హద్దులు గీసుకున్నంత మాత్రాన ప్రజల మధ్య సంబంధాలు చెడిపోవు. అన్ని రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రజలున్నారు. ఇది ప్రజల విభజన కాదు, సంస్కతి విభజన కాదు.

కానీ ఎలా చేస్తున్నారన్నది చూడాలి. ఎలా చేయకూడదో అలాగే చేస్తోంది కేంద్రం.

ఎక్కడైనా సామరస్యంగా అందరినీ ఒప్పించి విభజించ సంప్రదాయమే ఉంది. అసాధారణ సందర్భాల్లో నిర్ణయం తీసుకోవడానికి మాత్రమే పార్లమెంటుకు అధికారం ఇచ్చారు. కానీ సాధారణ సందర్భాలకు వర్తించదని అంబేద్కర్ కూడా చెప్పారు.

గతంలో ఎప్పుడూ రాష్ట్రాలను బలవంతం చేయలేదు. తీర్మానం వచ్చేదాకా ఆగారు. పంజాబ్ లో తప్ప ఎక్కడా అలా జరగలేదు. అక్కడ కూడా మొదట్లో పంజాబీలే విభజన కోరుకున్నారు. హిందీవాదులు, కేంద్రం వ్యతిరేకంగా ఉన్నాయి. శాస్త్రిగారి మరణం తర్వాత హిందీవాదులే వేరుపడాలని కోరుకున్నారు. అక్కడ కూడా ఏకాభిప్రాయం వచ్చాకే విభజన జరిగింది.

మూడు ప్రాంతాలను కలిపి కూర్చోబెట్టి పరిష్కరించుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. కానీ అధికాన్ని పూర్తిగా ఢిల్లీకి వదిలేస్తే యూనిటరీ వ్యవస్థగా మారిపోతుంది. ఫెడరల్ వ్యవస్థ ధ్వంసం అయిపోతుంది.

పీవీ సంస్కరణ వల్ల రాష్ట్రాలు కేంద్రాన్ని అడుక్కునే పరిస్థితి పోయింది.

ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడిచేలా విభజన ఉండకూడదు. బలవంతంగా విభజన జరగకూడదు. అందరినీ ఒప్పించి చేయడం సాధ్యమేనని నేను నమ్ముతున్నాను.

బిల్లులో లోపాలున్నాయి వాటిని సరిచేయాలి.

అన్నీ రాజధానిలో పెట్టడం కూడా సమస్యకు కారణం. కొత్త రాజధానిలో అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి.

పోలవరం నిర్మించాలి. రామయ్యపట్నంలో పోర్టు నిర్మించాలి.

తెలంగాణ సహా అందరికీ న్యాయం జరిగేలా చూద్దాం.”

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy