అసెంబ్లీ అప్ డేట్స్ @2 pm

ramRAMREDDY DAMODAR REDDY

రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు రాంరెడ్డి దామోదర్ రెడ్డి. సీమాంధ్ర నేతల సమైక్యవాదంలో పసలేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఎందుకు కావాలో వెయ్యి కారణాలు చెబుతామని, అందరినీ సంప్రదించాకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారన్నారు రాంరెడ్డి.
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షమేరకే తెలంగాణపై సోనియా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

HARISH RAO ON PAYYAVUALA

తెలంగాణపై పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు. పదవుల కోసం తెలంగాణ ఉద్యమం చేయడం లేదని, గ్రామాల్లో వందలాది మంది ప్రజలు తెలంగాణ కోసం తీర్మానాలు చేసిన విషయం మరిచి పోవద్దని హెచ్చరించారు. ఎన్టీఆర్ పాలన గురించి మాట్లాడుతున్న పయ్యావుల చంద్రబాబు పాలన గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రైతులపై కాల్పులు జరిపించింది చంద్రబాబు కాదా అని విరుచుకుపడ్డారు. 610 జీవో అమలు కాకపోవడానికి టీడీపీయే కారణమని హరీష్ రావు విరుచుకుపడ్డారు.

JULAKANTI
నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నాలుగైదు వేల మంది ప్రాణాలర్పించారని, తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రస్తుతం జరుగుతున్న పోరాటానికి పోలికే లేదన్నారు సీపీఐ నేత జూలకంటి రంగారెడ్డి. కట్టడాలు, భవనాలు కట్టినంత మాత్రాన నిజాం గొప్పవాడుకాదని చెప్పారు. దున్నేవానిదే భూమి అన్న సిద్దాంతం కమ్యూనిస్టులదని, ఇప్పడు కూడా అదే కోరుకుంటున్నామని తెలిపారు.

ERRABELLI-DANAM

పయ్యావుల ప్రసంగాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానన్నారు అదే పార్టీకు చెందిన  మరోనేత ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్రం విడిపోతే వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు దోచుకు తిన్నది చాలని,ఇక వదిలి వెళ్ళిపోవాలని ఆయన కోరారు. విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామని సమైక్య నేతలకు పిలుపునిచ్చారు. కర్నూలును రాజధానిగా అభివృద్ధి చేసుకోండి అంటూ సలహాలు ఇచ్చారు. ఇక సోనియా గురించి మాట్లాడే హక్కు కేశవ్ కు లేదన్నారు మంత్రి దానం నాగేందర్. కేశవ్ చాలా అమాయకంగా మాటాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కేంద్రానికి లేఖ ఇచ్చాక ఇప్పడు ఇలా మాట్లాడ్డంలో అర్ధం లేదని వాదించారు.

SUNITA LAKSHMA REDDY

సీమాంధ్రుల పాలనలో ఇప్పటికే పడిపోయామని తెలంగాణ వస్తే కొత్తగా పడిపోయేది ఏమీ లేదని మండిపడ్డారు సునీతా లక్ష్మారెడ్డి. ప్రజల ఆకాంక్ష కోసమే తెలంగాణ కోరుతున్నామని, సీఎం పదవికోసం కాదని వివరణ ఇచ్చారు.
మా కష్టాలేవో మేం పడతాం మా తెలంగాణ మాకిచ్చేయండిని విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ అనే మాటను కూడా ఉచ్చరించేందుకు వీలు లేకుండా చేశారంటూ టీడీపీపై విరుచుకుపడ్డారు సునీతా లక్ష్మారెడ్డి .

 

రాం రెడ్డి దామోదర్ రెడ్డి ప్రసంగం కొనసాగుతుంది

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy