అసెంబ్లీ నిరవధిక వాయిదా

2014-06-15_123629_10-1402398546-telangana-assembly-6పదిరోజుల పాటు జరగాల్సిన  అసెంబ్లీ సమావేశాలు … ఏడురోజులకే నిరవధికంగా వాయిదా పడ్డాయి. సభలో  30 గంటల 6 నిమిషాలు ప్రజాసమస్యలపై చర్చ జరిగింది. చివరి రోజు విపక్షాల విమర్శలపై సీఎం కేసీఆర్ కౌంటర్ తర్వాత … అసెంబ్లీని నిరవధిక వాయిదా  వేశారు స్పీకర్.  సభలో ప్రశ్నోత్తరాలపై చర్చ జరిగింది. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. 15 పాయింట్ ప్రోగ్రామ్ కింద.. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. 15 పాయింట్ ప్రోగ్రామ్ కమిటీలో.. ప్రజాప్రతినిధులు, ముస్లీం నేతలకు స్థానం కల్పించాలని సర్కార్ ను ప్రశ్నించారు MIM పక్ష నేత అక్బరుద్దీన్. రాష్ట్రంలో కల్తీ కల్లుతో ఎవరూ చనిపోలేదన్నారు మంత్రి పద్మారావు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గుడుంబా, కల్తీ కల్లు కట్టడి చేశామన్నారు. కల్తీకల్లుకు అడిక్ట్ అయి..తర్వాత కల్లు దొరక్కపోవడంతో కొందరు చనిపోయారని చెప్పారు.   సభలో ప్రశ్నోత్తరాల సమయంలో.. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. క్వశ్చన్ అవర్ తర్వాత సభలో మిషన్ కాకతీయపై చర్చ జరిగింది. గత పాలకుల తీరు వల్లే చెరువులన్ని ధ్వంసమయ్యాయని సభ్యులు ఫైరయ్యారు. అయితే రాష్ట్రంలో చెరువులన్నింటినీ ఐదేళ్లలో బాగు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకే మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ చేపట్టామని వివరించారు.  ఏడు రోజులు జరిగిన సభలో రైతు ఆత్మహత్యలతో పాటు విద్యుత్, వాటర్ గ్రిడ్ పై చర్చజరిగింది. సభలో టీఆర్ఎస్ సభ్యులు 18 గంటల 19 నిమిషాలు, కాంగ్రెస్ సభ్యులు 2 గంటల 56 నిమిషాలు, టీడీపీ సభ్యులు 2 గంటల 7 నిమిషాలు, ఎంఐఎం సభ్యులు 2 గంటల 30 నిమిషాలు, బీజేపీ సభ్యులు గంటా 38 నమిషాలు, వైసీపీ సభ్యుడు 42 నిమిషాలు, సీపీఎం ఎమ్మెల్యే 21 నిమిషాలు, సీపీఐ ఎమ్మెల్యే  33 నిమిషాలు మాట్లాడారు. నేతల వారిగా చూస్తే సీఎం కేసీఆర్ 2 గంటల 41 నిమిషాలు, జానారెడ్డి గంటా 25 నిమిషాలు, ఎర్రబెల్లి గంటా 23 నిమిషాలు, అక్బరుద్దీన్ గంటా 36 నిమిషాలు, లక్ష్మణ్ 44 నిమిషాలు, వైసీపీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు 42 నిమిషాలు, సీపీఐ రవీంద్ర నాయక్ 33 నిమిషాలు, సున్నం రాజయ్య 21 నిమిషాలు  సభలో మాట్లాడారు. ఏడు రోజుల్లో రెండు బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy