అసెంబ్లీ లో పోరుకు అన్ని పార్టీలు రెడీ….

రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు సాఫీగానే సాగాయి. అంతా ఏకపక్షంగా నడిపించిన కేసీఆర్.. విపక్షాలను సాటిస్ఫై చేస్తూ.. సెషన్ నడిపించారు. కానీ ప్రజెంట్ సీన్ రివర్స్ లో ఉంది. పవర్ కష్టాలు, రైతన్నల ఆత్మహత్యలు.. సర్కార్ కు ఇబ్బందిగా మారాయి. బడ్జెట్ సమావేశాలు సీఎంకు, మంత్రులకు.. కత్తిమీదసాముగానే మారనుంది. కొత్త రాష్ట్రంలో కొత్త బడ్జెట్…. సెప్టెంబర్ లో జరగాల్సిన బడ్జెట్ సెషన్ వాయిదావేస్తూ వచ్చింది. బడ్జెట్ ప్రిపరేషన్ కు కమిటీలు వేసింది. అసెంబ్లీ సమావేశాలపై.. విపక్షాలు నిలదీసినా లైట్ తీసుకుంది. సరిగ్గా ప్రభుత్వం ఏర్పాటైన 157వ రోజున.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది సర్కార్. పవర్ క్రైసిస్, రైతు సమస్యలు.. సర్కార్ కు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు రెడీ అవుతున్న విపక్షాలను ఎలా ఎదుర్కోవాలన్నదే అధికార పార్టీకి సవాల్ గా మారింది. ప్రతిపక్షాలను కాన్ఫిడెంట్ లోకి తీసుకుంటామన్న సీఎం.. అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి.. సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. ఆ తర్వాత ఫీజు రియంబర్స్ మెంట్ పై మాత్రమే అఖిల పక్షం ఏర్పాటుచేశారు. రెండు నెలల తర్వాత సీన్ మారింది. చేరికలపై దృష్టిపెట్టిన కేసీఆర్.. సక్సెస్ అయ్యారు. అదేటైమ్ లో తీవ్ర విద్యుత్ కొరత ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అందివచ్చిన అవకాశాన్ని ప్లస్ గా మార్చుకున్నాయి విపక్షాలు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు.. ధర్నాలు, టూర్లతో  హోరెత్తించాయి. విద్యుత్ సమస్యలపై.. సర్కార్ ను టార్గెట్ చేసేందుకు రెడీ అయ్యాయి. దీంతో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టారు సీఎం కేసీఆర్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమేరకు అమలౌతున్నాయని రివ్యూ మీటింగ్ పెట్టారు. అటు మంత్రులు కూడా సమీక్షలు, సమావేశాలు జరుపుతూ.. తమ శాఖలపై గ్రిప్ కోసం ట్రైచేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ విషయంలో.. కాంగ్రెస్, టీడీపీలను కౌంటర్ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యుత్ కొరతకు.. చంద్రబాబు వైఖరితోపాటు..కాంగ్రెస్ పార్టీ కారణమంటూ..ఎదురుదాడికి దిగాలని మంత్రులు ప్లాన్ చేస్తున్నారు. ఈ వ్యూహమే బెటరనే ఓపీనియన్ తో ఉంది సర్కార్. సర్కార్ ప్లాన్స్ ఎలా ఉన్నా..ఈ ఐదు నెళ్లలో పాలిటిక్స్ తో పాటు..పరిస్థితుల్లోనూ మార్పొచ్చింది. ప్రసెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy