అసెంబ్లీ వాయిదా నేపధ్యంలో సీమాంధ్రుల దాడి ప్లాన్స్

poster

అసెంబ్లీ 17 తారీఖు దాకా వాయిదా పడింది, కానీ సీమాంధ్ర నాయకులు, పార్టీలు మాత్రం తెలంగాణాపై దాడి కొనసాగిస్తున్నారు, కాదు కాదు, పండగ సందర్భంగా రెట్టించి దౌర్జన్యాలు చేయాలని ప్లాన్స్ ప్రకటిస్తున్నారు. సభలోనే TRS ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, గాదె చొక్కా పట్టుకున్నాడని నానా యాగీ చేసిన ఆంద్ర నాయకులు సభ బయట కూడా చాలా వైపుల నుండి దాడి మొదలు పెట్టారు.  విశాలాంధ్ర మహా సభ వారు బిల్లును వ్యతిరేకించకపోతే ఖబడ్దార్ అని పోస్టర్లు వేసారు. NGO అశోక్ బాబు 17, 18 తేదీల్లో బందు ప్రకటించాడు. పైగా భోగి మంటల్లో బిల్లును తగలబెట్టాలని పిలుపు కూడా ఇచ్చాడు. TDP వారు ఏకంగా 4,928 సవరణలు ప్రతిపాదించారు. మరో వైపు సీమాంధ్ర మీడియా దిగ్విజయ్ సింగ్ వోటింగ్ పెట్టాల్సిందే అన్నాడని ప్రచారం మొదలు పెట్టారు.

రాబోయే రోజుల్లో ఎన్ని కొత్త పడగలు తలెత్తుతాయో చూడాలి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy