అసెంబ్లీ వార్ కు అధికారపక్షం రెడీ

KCR-cabinet-expansionమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం భేటీ

అసెంబ్లీ వార్ కు రెడీ అయింది అధికారపక్షం. సమావేశాలకు అస్త్రశస్త్రాలు రెడీ చేస్తోంది. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. TRS భవన్ లో జరిగిన TRSLP భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సభలో చర్చకు వచ్చే ప్రతీ అంశంపై పూర్తి అవగాహనతో రావాలని సభ్యులకు సూచించారు గులాబీ బాస్. అటు విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని మంత్రులు, ముఖ్య నేతలను ఆదేశించారు. ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలన్న సీఎం సభలో క్రమశిక్షణగా ఉండాలన్నారు. అటు విపక్షాలు చేస్తున్న విమర్శలపై గట్టి కౌంటర్ ఇచ్చేందుకు పెద్ద కసరత్తే చేసింది అధికారపక్షం. ప్రాజెక్టుల రీడిజైన్లపై వెనక్కి తగ్గేది లేదని అవసరమైతే సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని LP భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. అటు రైతు ఆత్మహత్యల విషయంలో ఏం చేస్తున్నామనే దానిపై వివరించనున్నారు ముఖ్యమంత్రి. సెషన్ లోబీజేపీతో వచ్చే ప్రమాదమేమీ లేదన్న సీఎం…. రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్న లెప్ట్ పార్టీలు ఏపీ సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని గుస్సా అయినట్టు టాక్. దేశంలో ఏ రాష్ట్రం చేయనంతగా టీఆర్ఎస్ చేస్తోంది. అటు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు ఇస్తున్న 6 లక్షలు ఎక్స్ గ్రేషియాను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి. అటు మండలి డిప్యూటీ చైర్మన్ గా నేతి విద్యాసాగర్ ను కంటిన్యూ చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి. సెషన్ లో ఎక్కడా విపక్షాల విమర్శలు, ఆరోపణలపై వెనక్కి తగ్గవద్దని నేతలకు అధినేత చెప్పినట్టు తెలుస్తోంది. పనిలో పనిగా సర్కారు పథకాలు, సంక్షేమ పథకాలకు ఫుల్ పబ్లిసిటీ తీసుకురావాలని సూచించారు.

 

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy