అసెంబ్లీ సమావేశాలపై.. గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

kcr governorభూరికార్డుల ప్రక్షాళన, సమన్వయ సమితుల ఏర్పాటుపై గవర్నర్ నరసింహన్ తో  చర్చించారు సీఎం కేసీఆర్. శనివారం(సెప్టెంబర్-23)  రాజ్ భవన్ లో గవర్నర్ తో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన,, ఈవిషయాలతోపాటు, ఈనెల 26న జరగనున్న మహాబతుకమ్మ ఏర్పాట్లను వివరించారు. ఈ ఉత్సవానికి గవర్నర్ దంపతులను ఆహ్వానించారు సీఎం. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపైనే ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం.  సమావేశాల్లో చర్చించే అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆన్ లైన్  గేమ్స్, రిజిస్ట్రేషన్ యాక్ట్ , పిడి యాక్ట్ లో  కల్తీ నివారణ, ఎక్సైజ్ ఆక్ట్ లో సవరణ, తెలుగు సబ్జెక్ట్  తప్పనిసరి చేస్తూ మరో చట్టం చేసే విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి.

దీంతోపాటు.. రైతు సమన్వయ సమితులకు చట్ట బద్దతపైన గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం. సమాచార కమీషనర్ల నియామాకం, నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా సీఎం మాట్లాడినట్టు తెలుస్తోంది. నవంబర్ లో మెట్రో రైల్ కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, తెలుగు మహసభలు, ప్రపంచ పారిశ్రామిక  వేత్తల సదస్సు వంటి పలు పలుకార్యక్రామల ఏర్పాట్లపైనా గవర్నర్ తో చర్చించారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy