అసెంబ్లీ సూపర్ సక్సెస్ : హరీశ్

HARISHగతంలో ఎన్నడూలేని విధంగా అసెంబ్లీ సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు మంత్రి హరీశ్ రావు. గురువారం (మార్చి-29) అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో కీలక బిల్లులు ఆమోదించుకున్నామన్నారు. శాసనసభలో 11 బిల్లులను ఆమోదించుకున్నామన్నారు. అసైన్డ్ భూములపై హక్కు కల్పించామని, మేనిఫెస్టే ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు.

గిరిజన బిడ్డలకు ఈ రోజు మరువలేనిది అని సంతోషం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్. పంచాయతీరాజ్ చట్టం బిల్లును ఆమోదించుకున్నామని.. గిరిజనులకు ప్రత్యేక హక్కులు కలిగించిన చరిత్రాత్మక సమావేశాలుగా వీటిని చెప్పుకోవచ్చు అన్నారు. గిరిజనులకు హక్కులు, బాధ్యతలు, నిధులు కల్పించామని.. మన రాష్ట్ర DGPని మనమే నియమించుకునే హక్కు కలిగే చట్టం బిల్లును ఆమోదించుకున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మీ పథకం కింద లక్ష రూపాయలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. ప్రవేటు వర్సిటీ బిల్లుతో పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. గీత కార్మికులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నామని, చెట్టు పన్ను రద్దు..ఈత, తాటివనం అభివృద్ధి కోసం చర్చించుకున్నామన్నారు.

సభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం బాధాకరమని.. ప్రతి పక్షాలు అడగకపోయిన ప్రభుత్వమే సభను పెంచిన ఘనత TRS ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఇంతకుముందు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయంటే..ఎండిపోయిన మొక్కలతో ప్రతిపక్షాలు అసెంబ్లీకి వచ్చేవని..అయితే ఈ అసెంబ్లీ సమావేశంలో ఆ పరిస్ధితులు రాలేదన్నారు. గత 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 4 సంవత్సరాల్లో చేశామని వివరించారు. ప్రభుత్వం చేయలేని పనులపై ప్రతిపక్షాలు ప్రశ్నించాలన్నారు. ఎప్పుడులేని విధంగా పద్దులపై చర్చలు జరిగాయని, అసెంబ్లీకి వచ్చేముందు ప్రతిపక్షాలు ప్రిపేర్ అయి రావాలన్నారు. ప్రభుత్వంపై విమర్శించడం కాక, ప్రజలకు ఉపయోగపడేలా తెలంగాణ అసెంబ్లీ జరగాలని సూచించారు హరీశ్. అన్ని అంశాల్లో చర్చలు విజయవంతంగా జరిగాయన్నారు మంత్రి హరీశ్ రావు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy