అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి..ఇదీ ప్రొఫైల్

హైదరాబాద్ : పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ పదవికి నామినేషన్ వేయనున్నారు. స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేద్దామని సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు విపక్షాలన్నీ ఓకే చెప్పడంతో రూట్ క్లియర్ అయింది. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్న కాంగ్రెస్ కూడా స్పీకర్ పదవికి పోటీ పెట్టకూడదని సీఎల్పీలో నిర్ణయించింది. దీంతో స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక లాంఛనమే.

పోచారం ప్రొఫైల్

పోచారం శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఫిబ్రవరి 10, 1949లో జన్మించారు. 1976లో రాజకీయ ప్రవేశం చేశారు. 1977లో దేశాయిపేట సింగిల్ విండో  చైర్మన్ గా ఎన్నికయ్యారు. శ్రీనివాసరెడ్డి స్వస్థలం బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామం. ఆయనకు భార్య పుష్ప, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరెడ్డి ఇంజినీరింగ్ డిస్ కంటిన్యూ చేశారు. 1983లో టీడీపీలో చేరారు. 1989లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1994లో బాన్సువాడ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు.

1998లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999 – 2 వేల సంవత్సరంలో భూగర్భ గనుల శాఖ మంత్రిగా పని చేశారు. 2001, 2002లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో ఓడిపోయారు. 2005 నుంచి 2007 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతల్లో న్నారు. 2009లో బాన్సువాడ నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. 2011లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. 2011 మార్చి 24న టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 2014లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. మొత్తం ఆరు సార్లు బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy