
సీఎం పర్యవేక్షణ
రాష్ట్రంల పరిస్థితిని సీఎం శర్వానంద సోనోవాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నరు. బాధితులకు అండగా ఉండడంతోపాటు, ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ యంత్రాగాన్ని ఆదేశించారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కూడా తమ సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగిస్తోంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఎపుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కమంటూ ప్రాణం అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు అసోం ప్రజలు.