అసోం ప్రజల కలలు సాకారం చేస్తాం: మోడీ

modi in assamఅసోం ప్రజల కలలు సాకారమయ్యేందుకు తాము సహకరిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మంగళవారం అసోం పర్యటనలో ఉన్న ఆయన కోక్రాఝార్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోక్రాఝార్‌కి ఏడాదిలోగా డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు రూటును పొడిగిస్తామన్నారు. తొందరలోనే భారత వైమానిక దళం, పౌరులు వాడుకునేందుకు వీలుగా అక్కడ ఎయిర్ పోర్టును డెవలప్ చేస్తామన్నారు మోడీ. తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. గత పదిహేనేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్  చేయలేని పనిని కేవలం తాము 15 నెలల్లో చేసి చూపించామన్నారు ప్రధాని. ఢిల్లీ ఒక రూపాయి పంపిస్తుంటే 15 పైసలు మాత్రమే గ్రామాలకు చేరుతోందని రాజీవ్‌ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే అసోం ప్రభుత్వం మాత్రం తాము చేసే ప్రతి పనికీ లెక్కలు చూపుతూ క్లారిటీ గా  ఉందన్నారు. అసోం కోసం తన దగ్గర ఉన్న ఒకే ఒక పథకం ‘అభివృద్ధి’ అని తెలిపారు. అక్కడ రోడ్డు, రైలు, వాయు మార్గాల్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న కాలంలో ప్రపంచానికి భారీస్థాయిలో మానవ వనరులు అవసరమవుతాయని… దీనికోసం భారతీయ యువత సిద్ధంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. తర్వాత మోడీ గుహవటిలో పర్యటించి  ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులనుద్దేశించి స్పీచ్ ఇచ్చారు. ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ…ఇండియా మాత్రం వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. దేశంలో 65శాతం 35ఏళ్లలోపు ఉన్నవారేనని… వీరి నైపుణ్యాభివృద్ధి కోసం తొలిసారి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy