అదేపనిగా అబద్ధాలు చెప్తే….అంతే!

lieహెచ్చరిస్తున్న సైకాలజిస్టులు

‘సమస్యే లేదు. నేనస్సలు అబద్ధం చెప్పను’…..ఇదే పెద్ద అబద్ధం. అయితే.. ఈ మాటలకి ‘అబద్ధం’ అని పెద్ద పేరు పెట్టకపోయినా.. సింపుల్ గా కబుర్లు చెబుతున్నారు అనొచ్చు. సిటీలో ఇలాంటి కల్చర్ ఇప్పుడు బానే పెరిగిపోయింది. కొంతమందైతే.. అదే పనిగా చెప్పేస్తుంటారు కబుర్లు. అందులో ఏది నిజమో.. ఏది కథో ఎవరికీ అర్థం కాదు. అలాంటి వాళ్లంటే.. చుట్టూ ఉన్నవాళ్లకి ఇంప్రెషన్ బానే ఉంటుంది కూడా. ఎందుకంటే.. మనమంతా అలాంటి మాటల్ని లవ్ చేస్తున్నాం. ఇంప్రెస్ అవుతున్నాం. సో.. ఆ మాటలు చెప్పే వాళ్లకి కూడా ఆటో మేటిగ్గా ఇంప్రెస్ అవుతున్నాం. ‘నువ్వీ డ్రస్ లో ఏంజెల్లా ఉన్నావ్.’….అమ్మాయిల దగ్గర అబ్బాయిలు రెగ్యులర్ గా వాడే మాట ఇది. ఈ మాట అబద్ధమే అని తెలిసినా.. ఫిదా. అంత స్వీట్ గా చెబితే ఏం చేస్తరు చెప్పండి. అంత కాకపోయినా.. బానే ఉన్నాలే అనుకుంటారు బ్యూటిఫుల్ గల్స్. చేసుకున్న మేకప్ మీద అంత కాన్ఫిడెన్స్ మరి. ఇక అమ్మాయిలేం తక్కువ కాదు. యుఆర్ హేండ్సమ్ అంటూ.. ఎక్కించేస్తారు. వీళ్లు చెట్లెక్కక ఏం చేస్తరు మరి. చెప్పింది అమ్మాయి కదా. ఇది రోటీనే. ఇక లవ్ బర్డ్స్ మధ్య అబద్ధాలు లిస్ట్ అవుట్ చేస్తే గ్రంథాలు రాయొచ్చు. బుజ్జి పాపాయిలు.. బుల్లి బుల్లి అబద్ధాలు చెబితే.. చాలా హేపీగా ఫీలవుతాం.

ముఖ్యంగా ఫోన్లలో ఎక్కువగా కబుర్లు చెప్పేస్తుంటారు జనం. ఎక్కడున్న విషయం ఎవరూ చెప్పరంటే.. పెద్ద అతిశయోక్తి కాదేమో. ఫోన్ ఎత్తకపోయినా.. చూల్లే అని సింపుల్ గా చెప్పేస్తుంటాం. ఇది రెగ్యులర్ గా మేగ్జిమమ్ పీపుల్ చేసే పనే. కబుర్లు చెప్పకుండా.. కమిట్ అయ్యే వాళ్లు ఎంత మంది చెప్పండి. ఆఫీసుల్లో బాసులతోనూ.. కొలీగ్స్ తోనూ అంతే. అలా చెప్పేస్తుంటారు. నడిపించేస్తుంటారు. ఇలా ప్రతి దానికీ.. కబుర్లు చెప్పడం మొదలెట్టి.. చాలా విషయాల్లో నిజం చెప్పడం బంజేస్తున్నారు బోలెడు మంది. చిన్న చిన్న అబద్ధాల వరకు ఓకే. లైట్ తీసేస్కోవచ్చు. కానీ.. ఇలా ఇలా చాలా మంది.. చాలా విషయాల్లో అబద్ధాలు చెప్పడం మొదలెట్టేస్తున్నారు. ఎదుటి వారు లైట్ తీస్కున్నంత వరకు మాత్రమే ఓకే. కానీ.. కొన్ని అబద్ధాలు చాలా సీరియస్ ఇష్యూలు అవ్వొచ్చు. లైఫ్ రిస్క్ లో పడొచ్చు. కెరీర్ కొలేప్స్ అయిపోవచ్చు. ఇక లవ్ బర్డ్స్ కి కూడా అంతే. కొన్ని కొన్ని విషయాలు రిలేషన్ ని బ్రేక్ చేయొచ్చు. బెస్ట్ హాఫ్ కావాల్సినోళ్లు.. దూరమై పోవచ్చు. ఇదంతా సైకాలజిస్టులు చెప్పే లెక్క. నిజమే కదా మరి. ఇక నుంచి నిజాలు చెప్పడం స్టార్ట్ చేస్తే పోలా. అంతే కాదు. కబుర్లు చెప్పే వాళ్లని ఎంటర్ టైన్ చేయకుంటే ఇంకాస్త మంచిది. ఊహల్లో ఎందుకు బతకాలి. నేలమీదికొస్తే అయిపోద్ది. సత్యం.. అసత్యం అని పెద్ద పెద్ద మాటలు వాడకపోయినా.. సింపుల్ గా ఉన్నట్లుంటే.. లైఫ్ బిందాస్ అనేది కూడా సైకాలజిస్టుల మాటే. రియల్ లైఫ్ లో రియల్ గా బతకొచ్చు. ఏమంటరు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy