అహింసతోనే ప్రపంచ శాంతి: దలైలామా

DALAIఅహింసతోనే ప్రపంచ శాంతి చేకూరుతుందన్నారు ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా. హైదరాబాద్ లో దలైలామా పర్యటించిన ఆయన హైటెక్స్‌లో  సెంటర్‌ ఫర్‌ ఎథిక్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.  తర్వాత హైటెక్స్‌లో నీతి-విలువలు అనే అంశంపై మాట్లాడిన  దలైలామా…ఎవరినైనా చిరునవ్వుతో పలకరించటం అలవర్చుకోవాలన్నారు. అది మనకు, ఎదుటివాళ్లకు మంచి జరుగుతుందన్నారు. హత్యలు, ఘర్షణలతో శాంతి చేకూరదన్నారు. అహింసతోనే ప్రపంచ శాంతి చేకూరుతుందని తెలిపారు. గ్లోబల్‌ వార్మింగ్‌ అనేది అన్ని దేశాలకు సమస్యగా మారిందన్నారు దలైలామా.

వందల ఏళ్ల క్రితమే ఎందరో విదేశీయులు భారతదేశ గొప్పతనాన్ని గుర్తించారన్నారు దలైలామా. ప్రపంచానికి తత్వశాస్ర్తాన్ని బోధించిన పుణ్యభూమి భారత్. వైదిక మతంతో పాటు ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవం, జొరాస్టియన్ మతాలను ఆదరించిన దేశం ఇది. పాకిస్థాన్ కంటే భారత్‌లోనే ముస్లీలు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని మతస్వేచ్ఛ, శాంతి భారత దేశంలోనే ఉందన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy