ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌ను కుడుతున్న బ‌గ్‌

android-logoఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తోంది ఇశ్రాయేల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్ కంపెనీ చెక్‌పాయింట్. ఆండ్రాయిడ్ ఫోన్ల‌పై వారు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఓ బ‌గ్‌ను క‌నుగొన్నారు. ఈ బ‌గ్ ద్వారా హ్యాక‌ర్లు మీ ప‌ర్స‌న‌ల్ డేటాను దొంగ‌లించే ఆస్కార‌ముంద‌ని తెలిపింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్న క్వాల్‌కామ్ సంస్థ‌కు ఇదే విష‌యాన్ని తెలిపింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్వాల్‌కామ్ త‌యారు చేసిన ప్రాసెస‌ర్లు గ‌ల ఆండ్రాయిడ్ ఫోన్లు దాదాపు 900 మిలియ‌న్లుగా ఉన్నాయ‌ని చెక్‌పాయింట్ సంస్థ పేర్కొంది.  ప్ర‌స్తుతం హ్యాక‌ర్లు డేటాను హ్యాక్ చేసిన‌ట్లుగా ఎలాంటి రిపోర్టు లేద‌ని.. అయితే ఈ బ‌గ్‌ను క‌నుగొంటే మ‌రో మూడు నెలల్లో హ్యాక‌ర్లు విరుచుకుప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది చెక్‌పాయింట్ సంస్త‌.  చెక్‌పాయింట్ ఇచ్చిన స‌మాచారంతో అప్ర‌మ‌త్తమైన క్వాల్‌కామ్ సంస్థ బ‌గ్స్‌పై వ‌ర్క‌వుట్ చేస్తోంది. స‌మ‌స్య‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపింది. వినియోగ‌దారులు ఏవైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది.
చెక్ పాయింట్ సంస్థ ప్ర‌కారం క్వాల్‌కామ్ ప్రాసెస‌ర్‌తో న‌డిచే హ్యాండ్‌సెట్ల వివరాలు ఇలా ఉన్నాయి
BlackBerry Priv and Dtek50, Blackphone 1 and Blackphone 2, Google Nexus 5X, Nexus 6 and Nexus 6P, HTC One, HTC M9 and HTC 10, LG G4, LG G5 and LG V10, New Moto X by Motorola, OnePlus One, OnePlus 2 and OnePlus 3, US versions of the Samsung Galaxy S7 and Samsung S7 Edge and Sony Xperia Z Ultra.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy