ఆందోళనలో ఐటీ ఉద్యోగులు

itఐటీ ఉద్యోగం అంటే బోలేడు డబ్బు..ఐదంకెల జీతం. ఏసీలో పని, కార్లలో షికార్లు..దీనికి తోడు విదేశీ టూర్లు..విలాసంగా సాగింది మొన్నటి వరకు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అమెరికాలో ట్రంప్‌ అధికారంలోకి రావడం.. ప్రాజెక్ట్‌లు తగ్గడం తదితర కారణాలతో ఐటి కంపెనీల్లో లే ఆఫ్‌ల(పింక్‌ సిప్ల్‌ల) సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. హెచ్‌ఆర్‌ విభాగం నుంచి ఫోన్‌ వస్తేనే ఐటి ఉద్యోగులు హడలెత్తి పోతున్నారు. రేపటి నుంచి మీ సేవలు అవసరం లేదు. కంపెనీ కోరుకున్న విధంగా రాజీనామా చేస్తే రావాల్సిన ప్రయోజనాల గురించి ఆలోచిస్తాం. లేకపోతే పనితీరు బాగాలేదనే సాకుతో పంపించాల్సి వస్తోందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది మీ కెరీర్‌ మొత్తానికి ప్రమాదకరం. ఆలోచించుకోండి. ఇటువంటి సంభాషణలు ఈ మధ్య ఐటి కంపెనీల హెచ్‌ఆర్‌ విభాగంలో సాధారణమైపోయాయి. దీంతో ఐటీ కంపెనీల్లో బలవంతపు రాజీనామా(ఫోర్స్‌ఫుల్‌ రెసిగ్నేషన్‌), అక్రమంగా తొలగింపు(అన్‌ ఫెయిర్‌ టెర్మినేషన్‌) ఎక్కువయ్యాయి. ఇటువంటి పరిస్థితులు తిరిగి తలెత్తకుండా తగిన న్యాయం కోసం ఐటీ ఉద్యోగులు యూనియన్‌ బాట పట్టారు.

 ఉద్యోగ భద్రత కోసం చట్టాలు తిరిగేస్తున్న ఐటీలు

ఎప్పుడూ ప్రాజెక్ట్‌లు, డైడ్‌లైన్స్‌ అంటూ బిజీగా గడిపే సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌ ప్రస్తుతం లేబర్‌ కమిషనర్‌, లేబర్‌ కోర్టు, ప్రభుత్వాధికారులు చుట్టూ తిరుగుతున్నారు. కంపెనీలు ఏ చట్టం ప్రకారం ఏర్పాటయ్యాయి, అందులో పని చేసే వారికి ఎటుంటి హక్కులు ఉంటాయి. ఉద్యోగులను అర్థతరంగా తొలగించవచ్చా, తొలగించడానికి ఎటువంటి చర్యలను పాటించాలని అనే విషయాలు తెలుసుకునేందుకు కార్మిక చట్టాలను తిరగేస్తున్నారు. పక్కన ఉండే ప్రభుత్వ ఆఫీస్‌ ఏమిటో తెలుసుకోవడానికి బద్ధకించే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, తమ నగరాల్లోని లేబర్‌ కమిషన్‌ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అని ఆరా తీస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారి ముందు వాలిపోతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సరైన న్యాయం కోసం హైకోర్టు వరకు వెళ్లడానికి కూడా వెనుకాడడం లేదు. బలవంతపు రాజీనామాలు, అక్రమంగా తొలగింపుల వంటి రూపంలో తమకు ఎదురవుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె వంటి నగరాల్లోని ఐటి ప్రొఫెషనల్స్‌ ఫోరమ్‌ ఫర్‌ ఐటి ఎంప్లాయి్‌స’(ఎ్‌ఫఐటిఈ) అనే అసోసియేషన్లను ఏర్పాటు చేసుకున్నారు.

చెన్నైలో ఐటీ ఉద్యోగుల నిరసన గళం

ఐటీ ఉద్యోగుల తొలగింపుపై మొదట చెన్నైలో నిరసన గళం మొదలైంది. ఈ విషయంలో అక్కడి ఉద్యోగులు ఎఫ్‌ఐటిఈ-చెన్నై, ఎన్‌డిఎల్‌ఎఫ్‌ -ఐటి వింగ్‌ సహాకారంతో తమిళనాడు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించారు. ఆ తరవాత ఈ విధమైన నిరసన హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బెంగళూరు, అటుపై మిగిలిన ప్రాంతాలకు వ్యాపించిందఆయా సందర్భాల్లో కొన్ని సంస్థలకు నోటిసులు కూడా ఇచ్చారు.

..గత ఆగస్టులో బెంగళూరులో కొంత మంది ఐటీ ఉద్యోగులు కలిసి కర్ణాటక ఐటి/ఐటిస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అనే కార్మిక సంఘాన్ని (ట్రేడ్‌ యూనియన్‌) స్థాపించారు.

..బలవంతపు రాజీనామాలను వ్యతిరేకిస్తూ బెంగళూరులోని మూడు వేల మంది ఐటీ ఉద్యోగులు లేబర్‌ కమిషన్‌కు 20 పిటిషన్లను సమర్పించారు.

..చెన్నైలో 75 మంది ఇన్ఫోసిస్‌ ఎంప్లాయిస్‌ తరపున 1000 మంది లేబర్‌ కమిషనర్‌కు పిటిషన్లు సమర్పించారు. తమిళనాడుకు చెందిన న్యూ డెమెక్రటిక్‌ లేబర్‌ ఫ్రంట్‌ (ఎన్‌డిఎల్‌ఎ్‌ఫ)అనే ట్రేడ్‌ యూనియన్‌ ఐటి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక వింగ్‌ను ఏర్పాటు చేసింది.

..హైదరాబాద్‌ లేబర్‌ కమిషనర్‌ ఆఫీసుకు కూడా ఇటువంటి పిటిషన్లు గత మే నుంచి ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నాయి. 

మూడేళ్లలో ఐటీ రంగంలో లక్ష మందిని తొలగించారు. ఐటీ పరిశ్రమలో నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగులను తొలగించడంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి ప్రముఖ సంస్థలు గత మూడు నెలలోనే అయిదు వేల మంది ఉద్యోగులను తొలిగించాయి. లేబర్‌ కమిషనర్‌ దగ్గర 1600 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. లైవ్‌మింట్‌ వెబ్‌సైట్‌ రిపోర్ట్‌ ప్రకారం ఇప్పటి వరకు ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, విప్రో తదితర ఐటి సంస్థలు 56 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉండొచ్చని అంచనా. గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ మెకెన్సీ రిపోర్ట్‌ ప్రకారం వచ్చే మూడు నాలుగేళ్లలో ఐటి సర్వీసెస్‌ వర్క్‌ఫోర్స్‌లో సగం మందికి ఉద్వాసన తప్పకపోవచ్చు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy