బలవంతంగా ‘పోలవరం బిల్లు’ ఆమోదించారు..!

RAJNATHరాష్ట్ర ఎంపీల ఆందోళనల మధ్యే పోలవరం ఆర్డినెన్స్ కు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ బిల్లు సవరణలను లోక్ సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఎంపీలకు తోడు ఒడిశా, చత్తీస్ ఘడ్ ఎంపీలు ఆందోళనలు చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీలో కలవనున్నాయి. మూడు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు అభ్యంతరం తెలిపారు. ఆందోళనల మధ్య స్పీకర్ సభను వాయిదా వేశారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ బలవంతంగా..మంది బలంతో పోలవరం బిల్లును ఆమోదించారని ఆయన ఆరోపించారు. లోక్ సభలో బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణకు దుర్దినమన్నారు.

దీంతో భద్రాచలం పట్టణం మినహా మిగతా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో కలవనున్నాయి. కుక్కనూరు, వేలేరుపాడు, కూనవరం, వీఆర్ పురం, బూర్గంపాడు చింతూరు గ్రామాలు ఏపీలో కలవనున్నాయి. ఖమ్మంలోని ఏడు మండలాలు ఏపీలో కలవనున్నాయి. బిల్లు చట్టానికి విరుద్దంగా లోక్ సభకు తీసుకువచ్చారని విమర్శించారు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ సరిహద్దులు నిర్ణయించే ముందు అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా విడదీస్తారని ఆయన అన్నారు. తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు.

GUTTAపోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని….డిజైన్ మార్చి ముంపు ప్రాంతాలు తగ్గించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. నాలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడాకే బిల్లు పార్లమెంట్ లో పెట్టాలని ఆయన అన్నారు. గిరిజనులకు అన్యాయం చేయోద్దని..ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మొత్తానికి ఆందోళనల మధ్యే పోలవరం బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy