ఆంధ్ర నందులు : ఈ సినిమాలకే అవార్డులు

nandi awardతెలుగు సినీస్టార్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక నంది అవార్డులను మంగళవారం (నవంబర్-14)న ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జ్యూరీ కమిటీ సభ్యులను వివరాలను వెల్లడించారు. 2014లో మొత్తం 38 సినిమాలు ఎంట్రీకి రాగా, 2015లో 29, 2016లో 45 సినిమాలు నంది అవార్డుల కోసం ఎంపిక కాబడ్డాయి. నంది అవార్డులే కాకుండా.. ఎన్టీఆర్ జాతీయ సినిమా పుర‌స్కారం, బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం, నాగిరెడ్డి-చ‌క్రపాణి జాతీయ సినిమా పుర‌స్కారం, ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం అందుకున్న వారి పేర్లను కూడా జ్యూరీ స‌భ్యులు ప్రక‌టించారు.  కమిటీ ప్రతినిధులు నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్‌, గిరిబాబు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడంతో గత 3 సంవత్సరాలుగా ఈ నంది అవార్డులను ప్రకటించలేదు ఏపీ సర్కార్. అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.

నంది అవార్డులు

2014 ఉత్తమ చ్రితం- లెజెండ్‌
2014ఉత్తమ నటుడు-బాలకృష్ణ(లెజెండ్‌)
2014ఉత్తమనటి- అంజలి(గీతాంజలి)
2014 ఎన్టీర్‌ జాతీయ పురష్కారం- కమల్‌హాసన్‌
2014 బీఎన్‌రెడ్డి జాతీయ పురస్కారం- రాజమౌళి
2014 నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం- నారాయణమూర్తి
2014 రఘుపతి వెంకయ్య అవార్డు- కృష్ణంరాజు
2014 స్పెషల్‌ జ్యూరీ అవార్డు – సుద్దాల అశోకతేజ

2015 నంది అవార్డులు..

2015 ఉత్తమ చ్రితం    –  బాహుబలి(బిగినింగ్‌)
2015 ఉత్తమ నటుడు – మహేష్‌బాబు(శ్రీమంతుడు)
2015 ఎన్టీర్‌ జాతీయ పురష్కారం- రాఘవేంద్రరావు
2015 బీఎన్‌రెడ్డి జాతీయ పురస్కారం-  త్రివిక్రమ్‌
2015 నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం-  కీరవాణి
2015 రఘుపతి వెంకయ్య అవార్డు- ఈశ్వర్‌

2016 నంది అవార్డులు..

2016 ఉత్తమ చ్రితం- పెళ్లిచూపులు
2016 ఉత్తమ నటుడు- జూనియర్‌ ఎన్టీఆర్‌
2016 ఎన్టీర్‌ జాతీయ పురష్కారం- రజనీకాంత్‌
2016 బీఎన్‌రెడ్డి జాతీయ పురస్కారం- బోయపాటి శ్రీనివాస్‌
2016 నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం- కేఎన్‌ రామారావు
2016 రఘుపతి వెంకయ్య అవార్డు- చిరంజీవి

అవార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy