ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు క్లుప్తంగా

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు:

ఈ రోజు – 16-12-2013 రోజున రాష్ట్ర అసెంబ్లీ లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశ పెట్టబడింది. B.A.C. లో చర్చ లేకుండానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేరుగా సభలో బిల్లును ప్రవేశ పెట్టారు. బిల్లు ప్రతి అసెంబ్లీ అధికారిక website లో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంది.

tel map

బిల్లు ప్రధానాంశాలు:

బిల్లు 12 భాగాలు, 13 schedules తో 65 పేజీల్లో ఉంది.

Part 1:

మొదటి భాగం బిల్లు పదజాలాన్ని వివరిస్తుంది.

Part 2:

తెలంగాణా, మిగిలిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దులు, GHMC  పరిధి, అందులో గవర్నర్ అధికారాల విషదీకరణ, రెండు రాష్ట్రాల్లో పోలీసు బలగాలు, grey hounds దళాల పంపిణీ

Part 3:

రెండు రాష్ట్రాల శాసన సభ, మండలి ల సభ్యుల పంపిణీ, నియోజక వర్గాల పరిధులు, ప్రజా ప్రతినిధుల చట్టం 1950 లో మార్పులు, పార్లమెంటు, శాసన సభ నియోజక వర్గాల పరిధులలో మార్పులు చేర్పులు, షెడ్యుల్డ్ కులాలు, తెగల రిజర్వేషన్లలో ఎలక్షన్ కమీషన్ పాత్ర వంటి వివరాలు,

Part 4:

సీమాంధ్ర రాష్ట్రంలో కొత్త హై కోర్టు ఏర్పడేంత వరకూ, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కోర్టే రెండు రాష్ట్రాలకూ ప్రధాన కోర్ట్ గా  ఉంటుంది, దీనికి సంబంధించిన వివరణలు ఈభాగంలో ఉన్నాయి.

Part 5:

రెండు రాష్ట్రాల మధ్య ఖర్చులు, ఆదాయాల పంపిణీ వివరాలు, జనాభా ఆధారంగా వీటి పంపిణీ, ఈ భాగంలోనే కేంద్రం సీమాంధ్ర రాష్ట్రానికి అదనపు నిధులివ్వడాన్ని ప్రస్తావించారు.

Part 6:

రెండు రాష్ట్రాల ఆస్తులు, అప్పులు, పన్నుల పంపిణీ, ఎక్కడి ఆస్తులు అక్కడి వారికే, ఉమ్మడి ఆస్తుల పంపిణీ జనాభా ఆధారంగా, అవసరమైన చోట కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు నిర్ణయాధికారం.

Part 7:

కంపెనీలు, కార్పోరేషన్లు, సొసైటీల పరిధులు, అధికారాల వివరణ

Part 8:

అధికారుల పంపిణీ, రాష్ట్ర కేడర్ల వివరణ

Part 9:

జల వనరుల నిరవాహన, అభివృద్ది, పంపిణీ వ్యవస్థ, గోదావరి బోర్డ్ తెలంగాణా లో, కృష్ణా బోర్డ్ ఆంధ్రాలో, ఉమ్మడి జలా పంపిణీకి కొత్త బోర్డ్

Part 10:

సహజ వనరుల పంపిణీ, రెండు రాష్ట్రాలలో ఆర్ధిక అభివృద్ది కోసం కేంద్రం ఇవ్వబోయే పన్ను మినహాయింపులు, సీమాంధ్ర లో కొత్త రాజధాని లో అధికార వ్యవస్థల కల్పనకు కేంద్రం ఇవ్వబోయే సాయం వివరాలు

Part 11:

ఉన్నత విద్యా వ్యవస్థ లో ప్రస్తుతమున్న కామన్ రిజర్వేషన్ వ్యవస్థ మరో పదేళ్లకు మించకుండా కొనసాగింపు

Part 12:

రాజ్యాంగం లో తెలంగాణా చోటు కల్పన, పరిధుల నిర్వచన, ఇతర న్యాయ వ్యవహారాలు.

*********

ఈ పన్నెండు భాగాల తర్వాత 13 schedules లో ఒక్కో భాగం గురించిన వివరణ సవిస్తరంగా ఉంది. వీటిలో ప్రజా ప్రతినిధుల వివరాలు, షెడ్యుల్డ్ కులాలు, తెగలలో మార్పులు, ప్రభుత్వ నిధుల వివరాలు, పెన్షన్ల పంపిణీ, స్థిరాస్తుల వివరాలు, రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా పని చేయబోయే విద్య, వృత్తి విద్య, సాంకేతిక కళాశాలల వివరాలు, సహజ వనరుల వ్యవస్థ పర్యవేక్షణ వివరాలు ఉన్నాయి.

తెలంగాణా, ఆంధ్రా లలో లో ట్రైబల్ యునివర్సిటీలు, ఆంధ్రా లో ఎయిమ్స్ తరహా వైద్య కళాశాల, తెలంగాణలో హార్టీకల్చర్ యునివర్సిటీ, ఆంధ్రా లోని దుగరాజ పట్నం లో కొత్త పోర్టు … వీటికి మాత్రమే బిల్లులో హామీ లభించింది.

ఆంధ్రా కోసం ప్రతిపాదించబడిన వైజాగ్-చెన్నై ఆర్ధిక కారిడార్, విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టుల అభివృద్ది, కొత్త రైల్వే జోన్, కొత్త రాజధాని కోసం మెట్రో, BRTS వంటివి; తెలంగాణా కోసం ప్రతిపాదించబడిన ఖమ్మం స్టీల్ ప్లాంట్, 4౦౦౦ మెగా వాట్ల పవర్ ప్లాంట్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ వంటివన్నీ ఆయా ప్రభుత్వ వ్యవస్థలు పరిశీలిస్తాయని మాత్రమె బిల్లులో ఉంది.

ఇదీ ప్రస్తుతం బిల్లు స్వరూపం

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy