ఆకట్టుకుంటున్న ‘సీక్రెట్ సూపర్ స్టార్’ !

31717secretబాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్న సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. అద్వైత్‌ చందన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని.. ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆమిర్‌  నిర్మిస్తున్నారు. అమిర్ ఖాన్ సరసన అందాల భామ  జైరా వాసిం హీరోయిన్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్‌లుక్‌లో జైరా వాసిం స్కూల్‌ డ్రెస్‌ వేసుకుని నడుచుకుంటూ వెళుతున్నట్లు చూపించారు. ఈ చిత్రంలో జైరా వాసిం గాయని కావాలని ఆశపడుతుందట. తన తండ్రి రోజూ తాగి వచ్చి తనని, అమ్మని చిత్రహింసలు పెడుతుంటాడట. తన తల్లిని తాగుబోతు తండ్రి నుంచి కాపాడుకుని తన ఆశయం ఎలా నెరవేర్చుకుంటుంది అన్న ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్‌ ఆగస్టు 2న విడుదల కాబోతుండగా.. చిత్రాన్ని  దీపావళికి  రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తోంది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy