ఆకలి కేకలు ఇంకా అలాగే..!!

82687605.previewభారత్ ఆకలి రాజ్యంగా మారుతోంది. దేశంలో తిండిలేని వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచం మొత్తంలో ఆకలితో అలమటించేవారు భారత్ లోనే ఎక్కువగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. ఇండియాలో 19కోట్ల 40లక్షల మంది తిండి లేక బాధపడుతున్నారని తెలిపింది. వాల్డ్ వైడ్ గా ఆకలితో బాధపడుతున్నవారి సంఖ్య 79కోట్ల 50లక్షలుగా ఉందని యూఎన్ అనౌన్స్ చేసింది. 13కోట్ల 40 లక్షలతో చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది. 1990-92లో చైనా.. 28కోట్ల 90లక్షల మందితో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2014-15 సంవత్సరానికి ద స్టేట్ ఆఫ్ ఫుడ్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్ 2015 నివేదిక రిలీజ్ చేసింది. 1990తో పోల్చుకుంటే భారత్ లో ఆకలి కేకలు తగ్గినా ఇప్పటికీ భారీ సంఖ్యలో పేదలున్నారని తేల్చింది. పేదరిక నిర్మూలన  కోసం భారత్ లో అమలవుతున్న అనేక పథకాలను రిపోర్ట్ లో ప్రస్తావించారు. ఇక పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంపై 129 దేశాల్లో స్టడీ చేసింది ఎఫ్ ఏఓ. వీటిలో 72 దేశాలు గత పదేళ్లలో బెటర్మెంట్ సాధించాయని అనౌన్స్ చేసింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy