ఆకాశంలో అద్భుతం…సూపర్ మూన్

boatmoon-500x352భూమికి, చంద్రుడికి మధ్య దూరం తగ్గినప్పుడు చంద్రుడు మరింత పెద్ద కనిపిస్తాడు. ఈ చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. అదే సూపర్ మూన్ సమయంలో గ్రహణం ఏర్పడితే దాన్నే బ్లడ్ మూన్‌గా పిలుస్తారని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.

 

 

 

1443097562-6588

 ఇండియాలో కన్పించని సూపర్ మూన్

గత 33 సంవత్సరాల్లో ఇలా ఎన్నడూ జరగని.. మరో 18 సంవత్సరాల పాటు జరగబోని మహాద్భుతాల్లో ఒకటైన సూపర్ మూన్  దర్శనమివ్వనుంది. సుమారు గంటా పన్నెండు నిమిషాల పాటు ఉండే చంద్రగహణం జరుగుతుంది.  అయితే  ప్రపంచంలోని కొన్ని దే శాల ప్రజలకు సూపర్ మూన్‌తో పాటు చంద్రగ్రహణాన్ని ఒకే రోజు చూసే అవకాశం ఉంది. సాధారణ రోజులతో పోల్చితే  ఈ రోజు చంద్రుడు భూమికి కొంత దగ్గరగా వస్తాడు. ఇదే టైంలో 14శాతం పెద్దగా కనిపిస్తాడు. 30శాతం ప్రకాశవంతంగా దర్శనిమిస్తాడు. అయితే ఈ రోజే  సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ప్రపంచంలోని కొన్ని దేశాలకు మాత్రమే సూపర్ మూన్‌ను చూసే అవకాశముంది. రాత్రి  8.11 గంటలకు ( భారత కాలమానం ప్రకారం 28న ఉదయం 5.41 గంటలకు) అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలోని కొన్ని దేశాలు, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనపడుతుంది.  28వ తేదీన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ దృశ్యం పాక్షికంగా కనిపించనుంది. ఇండియాలో మాత్రం ఈ గ్రహణం స్పష్టంగా కనిపించకపోవచ్చునని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి నీడ నెమ్మదిగా చంద్రునిపై పడటం జరుగుతుంది. చంద్రుని కక్ష్య కచ్చితంగా వృత్తాకారంలో ఉండదు. అందువల్ల చంద్రుడు కొన్ని సందర్భాల్లో భూమికి దగ్గరగా వస్తుంటాడు. పెరీజీ పూర్ణ చంద్రుని చూడబోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్నీ చూసేందుకు  శాస్త్రజ్ఞులు, రీసెర్చులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో కేతు గ్రహం సంచరిస్తున్న టైంలో చంద్రగ్రహణం సంభవిస్తుందని… ఈ గ్రహణం కనిపించకపోయినా.. మేషం నుంచి మీనం వరకూ అన్ని రాశులపైనా గ్రహణ ప్రభావం ఉంటుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy