ఆకాశంలో వస్తున్న మెరుపులను బంధించిన శాటిలైట్

satellite2405వర్షాలు పడేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తాయి. సాధారణంగా అప్పుడే పిడుగులు పడటం సహజం. అయితే.. ఉరుములు, పిడుగులను పక్కన బెడితే… ఆకాశంలో మెరుపులు ఎలా మెరుస్తాయో ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థకు చెందిన ఎన్‌ఓఏఏ జీవోఈఎస్-17 అనే శాటిలైట్ రికార్డు చేసిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఉత్తర, దక్షిణ అమెరికాలపైన మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ మేఘాల్లోంచి పుట్టుకొచ్చిన మెరుపులను రికార్డు చేసింది ఆ సంస్థ. జియోస్టేషనరీ లైట్నింగ్ మ్యాపర్ ద్వారా ఆ శాటిలైట్ మెరుపులకు సంబంధించిన డేటాను పంపించింది. యానిమేషన్ రూపంలో ఉన్న ఆ వీడియోను ఈ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో … ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy