ఆకాశంలో వింత : భూమికి చాలా దగ్గరగా అంగారకుడు

mars earthవిశ్వంలో మరో వింత త్వరలోనే జరగనుంది. 15 ఏళ్ల తర్వాత అంగారకుడు (మార్స్) గ్రహం మరోసారి భూమికి అతి దగ్గరగా రానుంది. సూర్యుడికి ఎదురుగా రావటం వల్ల మరింత ప్రకాశవంతంగా కనిపించనుంది. 2018, జులై 27న ఈ అరుదైన వింత ఆకాశంలో కనిపించనున్నట్లు నాసా వెల్లడించింది. సూర్యుడికి ఎదురుగా రావడం కారణంగా ఆ కాంతి అంగారకుడి పడి ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది అంగారక గ్రహం. భూమికి సమీపంలో ఉండటం వల్ల ఎంతో పెద్దగా, కాంతి వంతంగా ఉంటుందని నాసా విడుదల చేసిన బులిటెన్ స్పష్టం చేస్తోంది.

సూర్యుడు – అంగారకుడు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో.. ప్రతి 15 నుంచి 17 ఏళ్లకు ఈ అపోజిషన్ ఏర్పడుతుంది. ఈ సమయంలో మార్స్.. భూమికి అతి చేరువగా వస్తుంది అని నాసా ప్రకటించింది.  60 వేల ఏళ్ల తర్వాత 2003లో భూమికి అతి చేరువగా అంగారకుడు వచ్చాడని.. మళ్లీ జూలై27న ఇలా జరుగుతుందని తెలిపారు శాస్త్రవేత్తలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy