ఆకాశంలో విన్యాసాలు చేస్తూ… సముద్రంలో కూలిన విమానం

air-show-crashఆకాశంలో విమానాలు చక్కర్లు కొడుతూ విన్యాసాలు చేస్తుంటే చూసేందుకు ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. కానీ ఆ విన్యాసాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే గుండె ఝళ్లుమని ఒళ్లంతా వణుకు పుడుతుంది.

ఇటలీలోని టెరాసినా సముద్ర తీరంలో ఎయిర్ షో నిర్వహించారు. ఇటలీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యూరోఫైటర్ జెట్ గగనతలంలో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. తీరం దగ్గరకు వేల సంఖ్యలో చేరిన పర్యాటకులు ఫైటర్ జెట్ విన్యాసాన్ని ఆసక్తిగా తిలకిస్తూ తమ ఫోన్లలో  విజువల్స్ షూట్ చేస్తున్నారు. ఇంతలోనే  మిలిటరీ విభాగానికి చెందిన యూరోఫైటర్‌ జెట్‌ ఒకటి సముద్రంలో కూలిపోయింది. విమానం తుదిదశ విన్యాసం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  దీంతో వీక్షకుల అరుపులు.. కేకలతో తీర ప్రాంతం దద్దరిల్లింది.

ఇటలీ రాజధాని రోమ్‌కు 110 కిలోమీటర్ల దూరంలో టెరాసినా సముద్రతీరంలో ఆదివారం (సెప్టెంబర్24) ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో పైలట్‌ మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన నేవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టి పైలట్‌ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే విమానం కూలడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. చాలా మంది వీక్షకులు ఈ ప్రమాద దృశ్యాన్ని తమ కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో వీడియో కాస్తా వైరల్ అవుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy