ఆకాశన్నంటిన పప్పుల ధరలు

423146-pulsesపప్పుల ధరలకు రెక్కలొచ్చాయి. ఎప్పుడూ లేనంతగా మండిపోతున్నాయి. నువ్వా….నేనా అన్నరీతిలో పోటీలు పడి మరీ పై పైకి పోతున్నాయి. ముఖ్యంగా కందిపప్పు పరుగులు పెడుతోంది. రెండొందలు దాటి…. సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. దీంతో సద్దుల పండుగకు పప్పు భారంగా మారింది.

ప్రతీ నెల సర్కార్ పీడీఎస్, ఐసీడీసీ సెంటర్ల ద్వారా పంపిణీ చేయడానికి 4వేల5వందల మెట్రిక్ టన్నుల కందిపప్పు బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనికి అదనంగా బహిరంగ మార్కెట్ కు మరో వెయ్యి  మెట్రిక్ టన్నులు కందిపప్పు అవసరముంది.  రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే కందిపప్పును బర్మా, మయన్మార్, సింగపూర్ దేశాల నుండి దిగుమతి అవుతుంది. వర్షాభావ పరిస్థితులతో ఈసారి.. దేశ వ్యాప్తంగా పప్పు దాన్యాల సాగు విస్తీర్ణం పూర్తిగా పడిపోయింది. దీనికి తోడు డిమాండ్ పెరగడంతో పప్పుల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 40 శాతమే పప్పుదాన్యాల సాగు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో వైపు బర్మా, మయన్మార్ దేశాల్లో కూడా కందిపప్పు నిల్వలు డెడ్ స్టోరేజ్ కి చేరడంతో దాల్ రేటు దడపుట్టిస్తోంది.

రాష్ట్రంలో పప్పు నిల్వల్ని  పెంచుకోవడంలో అధికారులు  విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. పప్పుదినుసుల సాగు విస్తీర్ణం పెంచకపోవడమే దీనిక ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఎమర్జేన్సీ కోటా కింద 50 నుండి 80 వేల మెట్రిక్ టన్నుల కంది పప్పు నిల్వలున్నా…వాటిని మన సర్కార్ దిగుమతి చేసుకోలేకపోతుంది. పక్కనే ఉన్న ఏపీ మాత్రం ఇప్పటికే 15 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పును దిగుమతి చేసుకున్నట్టు రికార్డుల చెబుతున్నాయి. మరో రెండు, మూడు నెల్లవరకు ఇదే సీన్ రిపీట్ అయ్యే చాన్స్ ఉంది. ఇదే అదునుగా జనాన్ని దోచుకునేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. దిగుమతి పడిపోవడంతో లేని కొరతను సృష్టిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో దాల్ వ్యాపారుల హవా కోనసాగుతోంది.

కందిపప్పే కాదు మిగతా పప్పు దాన్యాల ధరలు కూడా మండిపోతున్నాయి. గతేడాది బహిరంగ మార్కెట్లో  కిలో మినపపప్పు 90 రూపాయలుంటే.. ఇప్పుడు 185 రూపాయలకు చేరింది. ఇక పెసర పప్పు గతేడాది 85 రూపాయలుంటే.. ఇప్పుడు 125 పలుకుతోంది. ఇక శనిగపప్పు గతంలో 40 రూపాయలుంటే.. ఇప్పుడు 80 రూపాయల కొచ్చింది. మార్కెట్లోకి  కొత్త పంట వచ్చే వరకు పప్పులరేట్లు కిందికి వచ్చే చాన్స్ కనిపించడంలేదు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy