ఆకాశమార్గాన అమరావతికి కేసీఆర్

Secunderabad: Telangana Chief Minister K Chandrasekhar Rao during Telangana formation day celebrations  at Secunderabad Parade Ground on June 2, 2015. (Photo: IANS)అమరావతి శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వెళ్తారా.. వెళ్తే ఎలా వెళ్తారు.. ఇవే ఇపుడు జనంలో డిస్కషన్ టాపిక్స్. రోడ్డు మార్గంలో సీఎం వెళ్తారని డిసైడ్ చేసిన అధికారులు.. సెక్యూరిటీ రీజన్స్ తో డెసిషన్ మార్చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే హెలికాప్టర్ జర్నీ బెస్టంటున్నారు. ఇవాళ సీఎం అమరావతి టూర్ షెడ్యూల్ పై మరింత క్లారిటీ వచ్చే ఛాన్సుంది.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను చంద్రబాబు స్వయంగా ఇన్వైట్ చేయడంతో రోడ్డుమార్గంలో అమరావతి వెళ్లాలని మొదట డిసైడయ్యారు సీఎం. ఇంటలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి, కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారి సజ్జనార్, ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ హెడ్ మహేశ్ భగవత్ భేటీ అయి కేసీఆర్ టూర్ ఏర్పాట్ల పై చర్చించారు. అమరావతికి రోడ్డు మార్గంలో వెళ్లడం కష్టమనే నిర్ణయానికొచ్చారు అధికారులు. శంకుస్థాపనకు ఆ రాష్ట్ర ప్రజలు భారీగా వస్తుండడంతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని..  అందువల్ల సీఎం హెలికాప్టర్ లో వెళ్ళడమే మంచిదని సూచిస్తున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లపై ఏపీ పోలీసులతో కూడా సీఎం సెక్యూరిటీ అధికారులు చర్చించినట్టు సమాచారం.

దసరాకు ముందురోజు అంటే.. రేపు సూర్యాపేటలో పర్యటిస్తున్నారు సీఎం. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాత్రికి అక్కడే ఉండి పొద్దున్నే రోడ్డు మార్గంలో అమరావతి వెళ్తారని ముందుగా అధికారులు ప్లాన్ వేశారు. అయితే సీఎం సూర్యాపేటలో ఆగాలా.. వద్దా అనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు అమరావతికి సూర్యాపేట నుంచి వెళ్లాలా లేక హైదరాబాద్ కు వచ్చి వెళ్లాలా అనేదానిపై కూడా సీఎం నిర్ణయించకపోవడంతో షెడ్యూల్ ను ఖరారు చేయలేదు అధికారులు.  ఒకవేళ సీఎం చాపర్ లో వెళ్లే పక్షంలో…. ప్రధాని రాకకు ఒక గంట ముందుగా షెడ్యూల్ రూపొందించాల్సి ఉంటుందంటున్నారు అధికారులు. దీంతో సీఎం కేసీఆర్ అమరావతి షెడ్యూల్ పై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy