ఆకు ముక్కు గబ్బిలాలను కాపాడిన ఓయూ రీసెర్చ్ టీమ్

ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకుల కృషి.. అరుదైన గబ్బిలాల జాతికి ఊపిరిపోస్తోంది. హానికారక కీటకాల బెడదనుంచి కాపాడే అరుదైన గబ్బిలాలే ఈ ఆకుముక్కు గబ్బిలాలు. ఇవి కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలోని హనుమాన్ క్వారీ గుహలలో ఉన్నాయి. గుహల దగ్గర క్వారీ పనులు జరుగుతున్నప్పుడు వచ్చే భారీ శబ్దాలకు ఈ గబ్బిలాలు అంతరించి పోతున్నట్టు ఉస్మానియా యునివర్సిటీ రీసెర్చ్ టీం గుర్తించింది.

ఈ గబ్బిలాలు మనుషులకు హాని కలిగించే కీటకాలను తింటుంటాయి. ప్రకృతికి మేలు కలిగించే వీటిని రక్షించాలంటూ.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఓయూ టీం కోరింది. ఆ అరుదైన జాతి ఉన్న ప్రాంతాన్ని ‘గబ్బిలాల సంరక్షణ ప్రాంతం’గా గుర్తిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు కృషి చేసిన ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ బృందాన్ని అభినందింస్తున్నారు వన్యప్రాణి సంరక్షకులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy