‘ఆక్సిజన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Gopichand-Oxygen-Movie-Stills-11జ్యోతికృష్ణ డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘ఆక్సిజన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.  ఈ మూవీని అక్టోబర్ 12 రిలీజ్ చేయనున్నట్లు టీం ప్రకటించింది. గోపీచంద్ సరసన అందాల భామలు అను ఇమ్మాన్యుయెల్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా..జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు. శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌  బ్యానర్పై ఎస్‌. ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియోను త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ… ‘గోపీచంద్‌ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఆక్సిజన్‌’. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ముంబయి, గోవా, సిక్కిం, చెన్నైలో షూటింగ్‌ జరిగింది. యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో మన తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కల్గిస్తుంది’ అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy