ఆక్సిడెంట్ల సీజన్లో హై స్పీడ్ ట్రెయిన్ లపై చర్చ

rail

భారతీయ రైల్వే ట్రాక్ ల పై 160 కి.మీ. ల పైబడిన స్పీడ్ తో రైళ్ళు నడపడానికి నమూనా ప్రయత్నాలు చేయబోతోంది మన రైల్వే డిపార్ట్ మెంట్. ఈ మధ్యే రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే చే ప్రారంభించబడిన “హై స్పీడ్ రైల్వే కార్పోరేషన్” దీనికి సంబంధించిన విధి విధానాలు, సాంకేతిక వ్యవస్థ, సదుపాయాలూ రూపొందించే పనిలో ఉంది. మొదటిగా ధిల్లీ – అమృత్ సర్; ఇంకా ముంబై – అహ్మదాబాద్ ల మధ్య ఇలాంటి ప్రత్యేక రైళ్ళు నడిపించే ప్రతిపాదనలు ఉన్నాయి.

బులెట్ ట్రైన్ ల పేరుతొ జపాన్లో ఇలాంటి వ్యవస్థ 1964 నుండే ఉంది. చైనా, కొరియా, యూరోప్ లోని పలు దేశాల్లో ఉన్న హై స్పీడ్ రైళ్ళలో కొన్ని ౩౦౦ కి.మీ. ల పైబడిన వేగంతో ప్రయాణిస్తాయి. భారత్ లో ఇప్పటికి ఉన్న వాటిలో అత్యంత వేగవంతమైన రైలు 100 కి.మీ. ల వేగం దరిదాపుల్లో ఉంటుంది.

రవాణా వ్యవస్థల్లో రక్షణ పై ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ తలెత్తుతున్న పరిస్థితుల్లో ఈ కొత్త ప్రయత్నాలు ఎంత వరకు అమలవుతాయో చూడాలి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy