ఆఖరి పోరాటం : ఇండియా టార్గెట్ 231… చాహల్ కెరీర్ బెస్ట్ బౌలింగ్

మెల్ బోర్న్ : కీలకమైన మూడో వన్డేలో ఇండియాకు 231 రన్స్ టార్గెట్ ను పెట్టింది ఆస్ట్రేలియా. 48.4 ఓవర్లలో 230 రన్స్ కు ఆలౌట్ అయ్యింది లోకల్ టీమ్. భారత బౌలర్ యజువేంద్ర చాహల్.. ఆరు వికెట్లు పడగొట్టి.. తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ చేశాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్… మొదటినుంచే లోకల్ టీమ్ ను కంట్రోల్ చేస్తూ వచ్చింది. మ్యాచ్ మొదలైనప్పుడు వర్షం అడ్డుపడింది. దీంతో.. ఆలస్యంగా ఆట మొదలైంది. బౌలర్లకు అనుకూలించిన ఈ పిచ్ పై ఆస్ట్రేలియా కష్టమ్మీద పరుగులు రాబట్టింది. ఇండియన్ బౌలర్లు… టైమ్ టు టైమ్ వికెట్లు పడగొట్టి లోకల్ టీమ్ ను కంట్రోల్ చేశారు.  హ్యాండ్స్ కోంబ్ 58, మార్ష్ 39, ఖవాజా 34, మాక్స్ వెల్ 26 రన్స్ తో రాణించారు.

ఎంసీజీలో యజ్వేంద్ర చాహల్ రికార్డ్ బౌలింగ్

ఇండియా బౌలర్లలో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఒక్కడే ఆరు వికెట్లు పడగొట్టాడు.  భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఇద్దరూ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. యజ్వేంద్ర చాహల్… 42 పరుగులకు 6 వికెట్లు తీసి.. తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ చేశాడు. చాహల్ ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి. మెల్ బోర్న్ స్టేడియంలో ఓ భారత బౌలర్  నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు కూడా ఇవే. 2004లో అజిత్ అగార్కర్ కూడా 6/42 ప్రదర్శన చేశాడు.  3 మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే 1-1 తో సమంగా ఉన్నాయి రెండు జట్లు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే… వారిదే కప్. ఇండియా గెలిస్తే… అది మరో చరిత్ర కానుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy