ఆగస్టు నుంచే అమలు : స్టూడెంట్ వీసాలపై అమెరికాలో కొత్త నిబంధనలు

TRUస్టూడెంట్ వీసాలకు సంబంధించి అమెరికాలో కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఇకపై విదేశీ విద్యార్థులు అనుమతించిన కాలం కంటే ఎక్కువగా ఉంటే వారిని ప్రాసిక్యూట్ చేస్తారు.  దేశం నుంచి బయటకు పంపడమే కాకుండా మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధిస్తారు.

ఫారెన్ స్టూడెంట్స్ ఇమ్మిగ్రేషన్ విషయంలో అమెరికా ఇక కఠినంగా వ్యవహరించబోతోంది.  ప్రెసిడెంట్ ట్రంప్ సర్కార్ దీనిపై కొత్త నిబంధనలను ఆగస్ట్ 9 నుంచి అమల్లోకి తెస్తోంది.  ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీని ప్రకటించారు అధికారులు. విదేశీ  విద్యార్థులు అనుమతించిన టైమ్ కన్నా ఎక్కువ రోజులు ఉంటే వాటిని చట్ట వ్యతిరేకమైన రోజులుగా లెక్కలోకి తీసుకుంటారు.

అమెరికాలో ఉన్నత చదువుల కోసం విదేశీ విద్యార్థులకు F కేటగిరీ వీసా ఇస్తారు. ఒకేషన్ కోర్సుల వారికి M వీసా, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్, ఎక్చేంజ్ విజిటర్స్, మెడికల్ లేదా బిజినెస్ ట్రైనింగ్ కోసం వచ్చిన విద్యార్థులకు J కేటగిరీ వీసాలను మంజూరు చేస్తారు. వీళ్ళు తమ కోర్సులు పూర్తయిన తర్వాత స్వదేశాలకు వెళ్ళిపోవాలి.  అందుకోసం 60 రోజుల వరకూ గ్రేస్ పీరియడ్ ఇస్తారు.  ఆ లోగా తమ స్టడీ వీసా స్టేటస్ ను వర్క్ వీసాకింద మార్చుకోవాలి. లేదంటే దేశం విడిచి వెళ్ళిపోవాలి.

నిర్ణీత టైమ్ లోపు విద్యార్థి దేశం విడిచి వెళ్ళకపోతే… అతడిని మళ్ళీ అమెరికాలోకి అడుగుపెట్టకుండా లేదా పర్మినెంట్ రెసిడెన్సీ పొందకుండా పూర్తిగా నిషేధం విధిస్తారు.  180 రోజులకు మించి అమెరికాలో ఉండిపోతే… మూడు నుంచి పదేళ్ళ దాకా అమెరికాలో అడుగు పెట్టకుండా నిషేధిస్తారు.  ఈ పరిస్థితుల్లో విద్యార్థులు తమ వీసా గడువు ముగిస్తే… వర్క్ వీసా కింద పొడిగించుకోవాలి… లేదా దేశం విడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఉల్లంఘిస్తే…కోర్టులో విచారణ జరిపించి…విద్యార్థుల్ని వాళ్ళ సొంత దేశాలకు పంపే వాళ్ళు.

ఇంటర్నేషనల్ స్టూడెంట్ డేటా ప్రకారం… 2016-17లో భారతీయ విద్యార్థుల సంఖ్య గతంకంటే 12శాతం పెరిగి… లక్షా 86వేల మందికి చేరింది. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో రెండో స్థానం భారతీయులదే. 2017 సెప్టెంబర్ 30 నాటికి F కేటగిరీ కింద ఇండియన్ స్టూడెంట్స్ 4లక్షల 21వేల మంది ఉన్నారు. దాంతో.. ఆగస్టు 9 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు భారతీయ విద్యార్థులపైనా తీవ్ర ప్రభావం చూపించే అవకాశముంది.

 

 

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy