ఆగస్టు 14న జనసేన మేనిఫెస్టో విడుదల: పవన్

janasena
విభజన తరువాత అన్నివిధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశానికి మద్దతిచ్చామన్నారు జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. తాను నాడు మద్దతిచ్చినది ఏపీ పునర్నిర్మాణానికి మద్దతిచ్చేనే కానీ తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణానికి కాదన్నారు.

ఆగస్టు 14న జనసేన మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు పవన్. కాపు రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపైన ఆలోచించారా అని సీఎం చంద్రబాబును అని ప్రశ్నించారు. అందరికీ ఆర్థిక, ఉద్యోగ భద్రత కావాలన్నారు. జనసేన కులాల మధ్య చిచ్చు పెట్టదన్నారు. కులాల మధ్య ఐక్యత సాధిస్తామన్నారు. దేశంలోని అన్ని పథకాలకు ఒక కుటుంబం పేర్లేనా అని ప్రశ్నించారు.

రాజకీయం నేను కోరుకున్నది కాదని..అలా జరిగిందంతే అన్నారు. ప్రజలను నా ఓట్ బ్యాంక్  కాదని.. మీరంతా నా కుటుంబమన్నారు. జనసేన సభ్యత్వం తీసుకోవాలంటే 9394022222 కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు అని అన్నారు. మీరు జనసేనలో సభ్యులవుతాన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కాబోతోందని.. జనసేనకు కొత్త యువనాయకత్వం కావాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy