‘ఆటగాళ్ళ’కు శేఖర్ కమ్ముల క్లాప్

ROHITHడిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు నారా రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా ‘ఆటగాళ్ళు’ మూవీ.. గేమ్ ఫర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు విలన్‌గా నటించనున్నారు. ‘ఆంధ్రుడు’ సినిమాను డైరెక్ట్ చేసిన పరుచూరి మురళి చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం(అక్టోబర్-11) ప్రారంభమైంది. ఈ సినిమాను ‘ఫిదా’ ఫేం శేఖర్ ఖమ్ముల క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లుక్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ విషయాన్ని జగపతిబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసి, సంతోషాన్ని పంచుకున్నారు. గేమ్ ఫర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్ ను ట్వీట్ చేశారు జగపతిబాబు.  సాయి కార్తీక్ మ్యూజిక్ లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో నటించే హీరోయిన్ తదితర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy