ఆటోమేటిక్ గేర్లతో రానున్న మారుతి కొత్త కారు!

celభారత కార్ల మార్కెట్ల రాజు మారుతి త్వరలోనే పలు విశిష్టతలతో ఉన్న ఓ కొత్త మాడల్ ను ప్రవేశ పెట్టనుంది. ‘సెలీరియో’ పేరుతొ రానున్న ఈ మాడల్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ కలిగి ఉంటుంది. 23 కిమీ ల ఇంధన సామర్ధ్యం కలిగి ఉండే ఈ కారు అల్లోయ్ వీల్స్, బ్లూ టూత్ వంటి సౌకర్యాలను కలిగి ఉంటుంది. సుమారు ఆరు వందల కోట్ల పరిశోధనా వ్యయం తర్వాత మారుతి తెబోతున్న ఈ కారు ఇదే రకం కార్లైన హోండా బ్రయో, హ్యుండై గ్రాండ్ i10 లతో పోటీ పడనుంది. ఆరు లక్షల పై పరిధిలో ఉన్న ఈ కార్లను ఎదుర్కోవడానికి మారుతి తన కొత్త మాడల్ ను కాస్త తక్కువ ధరతో తేనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరిలో ఏడు రంగుల్లో ఈ మాడల్ ను లాంచ్ చేయనున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy