ఆటోలపై స్పెషల్ డ్రైవ్… రూల్స్ ఫాలో కాకపోతే సీజ్

  • చలాన్లతో మారకపోతే కేసులు
  • రూల్స్ బ్రేక్ చేస్తే సీజ్
  • హారన్, మ్యూజిక్ సౌండ్స్ తో ఇబ్బందిపెట్టొద్దు
  • ఇండికేటర్స్, నంబర్‌‌‌‌‌‌‌‌ప్లేట్‌ తప్పని సరి

హైదరాబాద్ లో కొందరు ఆటో డ్రైవర్లు రూల్స్‌‌‌‌‌‌‌‌ ఫాలో అవడం లేదు. దీంతో వాహనదారులతో పాటు వాకర్స్‌‌‌‌‌‌‌‌కి ఇబ్బందిగా మారిం ది. ఆటో వాలాలు రోడ్‌‌‌‌‌‌‌‌పై సడెన్‌‌‌‌‌‌‌‌గా లెఫ్ట్‌‌‌‌‌‌‌‌, రైట్‌ టర్నింగ్స్‌‌‌‌‌‌‌‌ తీసుకోవడం, ఇండికేటర్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నా వాడకపోవడం లాంటి పనులు చేస్తున్నారు. కొన్ని ఆటోలకు ఇండికేటర్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఉండటం లేదు. మరోవైపు ఆటోలో డెక్‌‌‌‌‌‌‌‌ సౌండ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా పెంచి సాంగ్స్‌‌‌‌‌‌‌‌ ప్లే చేయడం వాహనదారులకు ప్రాబ్లమ్‌ గా మారింది. ఇలాంటి వాటిపై ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ పోలీసులు నిఘా పెట్టారు. ఇకపై ఆటో డ్రైవర్లు రూల్స్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ పోలీసులు.

హైదరాబాద్‌ , సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉండే వివిధ పోలీస్‌ స్టేషన్లకు వరసగా కంప్లయింట్లు అందుతుండటంతో ట్రాఫిక్‌ అధికారులు స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. ప్రధానంగా సైబరాబాద్ కమీషనరేట్ లిమిట్స్ లో రద్దీగా ఉండే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, మియాపూర్, సిటీ కమిషనరేట్‌ పరిధిలో పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్, లక్డీకాపుల్ నాంపల్లి, పెన్షన్‌ ఆఫీస్, మెహిదీపట్నం , జీవీకే ఐనాక్స్‌ లాంటి ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు నిర్లక్ష్యంగా ఆటో నడుపుతున్న డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో మొదటి రోజు తనిఖీల్లో భాగంగా రూల్స్‌ బ్రేక్‌ చేసిన 364ఆటోలపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిలో 185 ఆటోలను ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. 18 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఈ స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌ చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 1,162 ఆటోలను తనిఖీ చేయగా 291 ఆటోలను ఆర్టీవో అధికారులకు అప్పగించారు.

ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటో నడుపుతున్న 26 మందిని కోర్టులో హాజరుపరిచారు. నంబర్ ప్లేట్స్ లేని 53 ఆటోలను, ఓవర్ లోడ్ గా వెళ్తున్న 23 ఆటోలను గుర్తించి చలాన్లు విధించారు. ఒకరి చలాన్లు మరొకరికి.. ట్రాఫిక్‌ పోలీసులు చేపడుతున్న ఈ స్పెషల్ డ్రైవ్ ను కొంతమంది ఆటో డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ పేరుతో అందినకాడికి ట్రాఫిక్ పోలీసులు తమను దోచుకుంటున్నా రని అవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ తప్పనిసరిగా ఆటో నడిపితేనే ఇండ్లు గడుస్తుందని..ఇలాంటి పరిస్థితుల్లో తనిఖీలు పేరిట కింది స్థాయి ట్రాఫిక్‌ సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని డ్రైవర్లు చెబుతున్నా రు. రూల్స్‌ బ్రేక్‌ చేసిన వారిపై చర్యలు తీసుకుంటే ఇబ్బంది లేదంటున్నారు. కానీ కెమెరాల ద్వారా ఫొటో తీస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు ఒకరికి పంపాల్సిన ఆటో చలాన్లను మరొకరికి పంపిస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.

వీటిని పాటించాల్సిందే

స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం వల్ల రూల్స్‌ బ్రేక్‌ చేస్తున్న ఆటోలు ఎక్కువగానే ఉన్నట్టు ట్రాఫిక్‌ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్లు ఏయే రూల్స్‌ ఫాలో కావాలో అధికారులు సూచిస్తున్నారు. ఆటో వెనుక, ముందు నంబర్ ప్లేట్ సరిగా కనిపించే విధంగా ఉండాలి. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌ కు పాల్పడొద్దు. అంటే.. వెహికిల్ నంబర్ కనిపించకుండా పూలు, ప్లాస్టిక్ పేపర్లు, రేడియం స్టిక్కర్‌‌‌‌‌‌‌‌ , వైట్ టేప్ పెట్టడం, నంబర్ ప్లేట్‌ ను బెండ్ చేయడం, గ్రీజ్‌ రాయడం, పెయింట్ వేయడం, ఆయిల్ పూయడం లాంటివి చేయవద్దని ట్రాఫిక్‌ పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్నా రు. నంబర్ ప్లేట్ లోని లెటర్స్‌ కనబడకపోయినా కఠిన చర్యలు తీసుకుంటా మని చెబుతున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, రాత్రి వేళల్లో సిగ్నల్స్ జంపింగ్ చేయొద్దంటున్నా రు. రాంగ్ రూట్లో ఆటోలను నడపడం, అవసరం ఉన్నా లేకపోయినా హారన్‌ కొట్టడం లాంటివి చేయొద్దని చెబుతన్నారు. సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మిగతా వాహనాలను అతివేగంతో ఓవర్‌‌‌‌‌‌‌‌ టేక్‌ చేయడం, మందు తాగి ఆటో నడపడం లాంటివి చేయొద్దని ట్రాఫిక్‌ అధికారులు సూచిస్తున్నారు. అడ్డదిడ్డంగా ఆటో నడుపుతూ.. సడెన్‌ గా బ్రేక్ లు వేసి వెనుక వచ్చే వాహనాలకు ఇబ్బందులు పెట్టడం, వివిధ రకాల సౌండ్స్ సిస్టమ్స్ తో ఆటోలో డెక్‌ ను ఏర్పాటు చేసుకోవడం లాంటివి చేయొద్దు. ఇక డ్రైవర్లు కచ్చితంగా డ్రెస్ కోడ్ మెయింటెన్ చేయాలి. ఆర్ సీ, పొల్యుషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సురెన్స్, పర్మిట్ ఎన్ వోసీ వంటి డాక్యుమెంట్లు పక్కాగా ఉండేలా చూసుకోవాలని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy