ఆడపిల్లల సంఖ్యపై అధ్యయన కమిటీ రిపోర్ట్

IKEA-UNICEF

భారతదేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తోంది భారత మహిళా అధ్యయన కమిటీ. అందులో భాగంగానే హిందూమత నాయకులతో చర్చలను నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను విమెన్ అండ్ ఛైల్డ్ డెవలప్మెంట్ మంత్రికి అందజేసింది.హిందువులు జరిపే మతపరమైన పూజలు ఇతర రాకర్యక్రమాలలో ఆడపిల్లలకు కూడా ప్రాధాన్యత కల్పించాలని కోరనుంది. సామాజికంగా, సంస్కృతి పరంగా ఆడపిల్లకు ప్రాధాన్యత కల్పించడం తప్పనిసరి అని చెబుతున్నారు కమిటీ ప్రెసిడెంట్ పామ్ రాజపుత్. ప్రస్తుతం దేశం వెయ్యిమంది పురుషులకు 800మంది మాత్రమే స్త్రీలు ఉన్నారని ఆయన చెప్పారు. పరిస్థితి ఇలానే ఉంటే ఈ సంఖ్య మరింత దిగజారే అవకాశం ఉందని అన్నారు. అందుకే స్త్రీలకు ప్రాధాన్యతను పెంచాలని కమిటీ సూచించింది. ప్రస్తుతం ఉన్న 33 శాతం రిజర్వేషన్ ను 50 శాతం పెచితే బావుంటుందని కమిటీ అభిప్రాయపడింది. అంతేకాక క్రీయాశీల రాజకీయాలు ఇంకా అనేక అంశాలలో మహిళ ప్రాధాన్యత పెంచాలని కమిటీ సూచించింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy