ఆదర్శ గ్రామాల లిస్టులో ధర్మాజిగూడెం

yadadriయాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మాజిగూడెం గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామం బహిరంగ మల, మూత్ర విసర్జన లేని జాబితాలో చేరింది. గ్రామంలోని 400 ఇళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్థులు. గ్రామంలో ఉన్న నాయకులతో పాటు ప్రజలు మరుగుదొడ్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రతీ ఇంట్లో టాయిలెట్స్ నిర్మించుకున్నారు. గతంలో మరుగుదొడ్లు లేక ఈగలు, దోమలతో పాటు మురికి కాల్వల నుంచి వచ్చే దుర్వాసనతో రోగాలతో ఇబ్బందిపడే వాళ్లమంటున్నారు గ్రామస్థులు. ప్రస్తుతం టాయిలెట్స్ కట్టించుకోవడంతో ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నారు.

మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు ఎక్కడా మురుగు నీరు ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని చెబుతున్నారు. పరిశుభ్రత పాటించడంతో చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నామంటున్నారు. ధర్మాజిగూడెంను మిగతా గ్రామాల ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy