ఆదర్శ దంపతులుగా సీతారాములు

sri rama-sita 4వేల ఏళ్లు గడిచినా… తరాలు మారినా.. రాముడు, రామాయణానికి ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. అందులోని పాత్రలు..నిత్యం మన జీవితాల్లో కినిపిస్తునే ఉన్నాయి. మానవ జీవితాలపై రాముడు, రామాయణ ప్రభావం ఎంత వరకు ఉంది…ఏ ఏ ప్రమాణాలు, విలువలు నాటి, నేటి సమాజానికి మార్గదర్శనం చేశాయి.  శ్రీరామనవమి..హిందువులు గొప్పగా జరుపుకునే పండగల్లో ఒకటి. ఏటా రామనవమి వచ్చిందంటే దేశమంతా హడావిడి. రామ కళ్యాణం మొదలు..వనవాసం, పట్టాభిషేకం వరకు ప్రతీ అంశం మానవ జీవితంతో ముడిపడినవే. వందల ఏళ్లుగా సీతారాములను ఆదర్శ దంపతులుగా కీర్తిస్తున్నాం. సీత కన్నేశారు, సీత పుట్టే లంక చెడే, ఇంట్టి గుట్టు లంకకు చేటు లాంటి మాటలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.

వాల్మీకి రామాయణంలో రాముడి పాత్ర…సాధారణ మనిషి కష్టానికి అద్దంపడుతుంది. సగటు మనిషికుండే భావోద్వేగాలు, కష్ట సుఖాలను రాముడి పాత్ర మనకు వివరిస్తుంది. అన్నగా, కొడుకుగా, భర్తగా, రాజుగా విభిన్న పాత్రల్లో మనుషులు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు, ఎలా ఉండకూడదో చెప్పాడు రామచంద్రుడు. నాటి, నేటి సమాజాలకు మంచి సందేశంగా నిలిచాడు. రాజ్యాన్ని పాలించేరాజు ఎలా ఉండాలి, ఎలా ఉంటే…ప్రజలకు మంచి పాలన అందుతుందన్న విషయాల్లో కూడా రాముడు, రామాయణం మార్గనిర్ధేశనం చేశాయి. కుల,మతాల ప్రస్తావన లేకుండా సమాజం ఎలా ఉండాలో మనకు రామాయణం చూపిస్తుంది. వనవాసం సమయంలో శబరి ఎంగిలిని తిని…కుల సమస్యను పట్టించుకోవద్దని చెప్పకనే చెప్పాడు రాముడు.

అధికారం కోసం మనుషులు ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని… రామాయణం మనకు స్పష్టంగా చూపిస్తుంది. రాజ్యకాంక్ష కంటే  మానవ సంబంధాలే బలమైనవని రాముడు, భరతుడు పోటీ  మరీ నిరూపిస్తారు. అందుకే అన్నదమ్ములను రామణయణంలోని పాత్రలతో పోలుస్తారు పెద్దోళ్లు.  అధికారం, ఆస్తులు,  విలువలు పతనం అయినా సరే సంతోషాలకే ప్రాధాన్యం ఇస్తున్న ఘటనలు ఎన్నో.  అలాంటవి వొద్దని చెప్పేందుకు రామాయణం ఓ మంచి ఉదాహరణగా మనకు కనిపిస్తున్నది. రావణాసురుడిని చంపిన తర్వాత కూడా యుద్ద నీతిని ప్రదర్శిస్తాడు రాముడు. విభిషుణునుడికి కూడా అదే చెప్తాడు. ఎంతటి శత్రుత్వం అయినా  మరణంతో ముగుస్తుందని, అందుకే  రావణుని అంత్యక్రియలు శాస్త్ర బద్దంగా చేయాలని చెప్తాడు రాముడు. వాలీ, సుగ్రీవుల మధ్య  జరిగిన యుద్దంలో సుగ్రీవుని వైపు రాముడుంటాడు. ఇక్కడ బలమైన సంప్రదాయాలు,  మానవీయ  విలువల మధ్య ఉన్న రాముడు మనకు కనిపిస్తాడు.

తన తల్లిదండ్రులకు దూరం అయినప్పుడు దుఖిస్తాడు రాముడు. భార్యా వియోగం అయినప్పుడు బోరుమంటాడు. తండ్రి మరణ వార్త తెలిసి బాధపడ్తాడు. యుద్ద రంగంలో తమ్ముడు మూర్చిల్లితే  అయ్యో అంటాడు. ఇలా సగటు మనిషి బావోద్వేగాలను రాముని రూపంలో రామాయణం మనకు పరిచయం చేస్తుంది. ఇవన్నీ  సాధారణ మనుష్యులకుండే లక్షణాలే. దశవతారాల్లో రాముడి అవతారం ఒకటని అంటారు. అయితే మనుష్యులకు, వారి ప్రవర్తనలకు అద్దం పడుతుంది రామాయణం. మానవ జాతి ఉన్నంత కాలం రామాయణం  ఆదర్శప్రాయంగా ఉంటుంది.  రాముడు, సీత, లక్ష్మణుడు ఇట్లా ఎన్ని పాత్రలు తీసుకున్నా….. నాడు, నేడు ఆదర్శప్రాయుడుగా ఉన్నది మాత్రం శ్రీరాముడే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy