ఆదాయానికి మించిన ఆస్తులు : జాయింట్ డైరెక్టర్ ఇంటిపై ACB దాడులు

ED-RIDES-AV-2మహబూబ్ నగర్ జిల్లా ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ సురేష్ కుమార్ ఇంటిపై ACB అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం (జూన్-1) తెల్లవారు జాము నుంచి మొత్తం ఐదు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మియాపూర్ లోని బాలాజీ నగర్ లో ఆయన ఇంటితో పాటు.. వైజాగ్, మహబూబ్ నగర్, హైదాబాద్ లోని మరో రెండు చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు బ్యాంక్ లాకర్స్ , 20 తులాల బంగారం, భారీగా ఆస్తుల్ని ACB అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారం రావడంతో ..సురేష్ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించారు ACB  అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy