‘ఆదియోగి’ విగ్రహాన్నిఆవిష్కరించిన ప్రధాని

aadi devuduప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానిదేనన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచంలో యోగాకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. యోగాతో.. శివుడి దగ్గరికి జీవుడు చేరతాడన్నారు మోడీ. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ధ్యానలింగ పంచభూతారాధనలో పాల్గొన్నారు. మహాయోగ యజ్ఞాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆదియోగి చరిత్రపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు మోడీ.

ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించటం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు ప్రధాని .  నేను నుంచి మనం అనే భావన కలిగించేదే యోగా అన్నారు. పరమశివుడు ప్రపంచమంతా ఉన్నాడని.. శివుడి దేహం భిన్నత్వంలో ఏకత్వానికి సుచిక అన్నారు . ప్రపంచం మానసిక ప్రశాంతతను కోరుకుంటోందని.. యోగాతోనే మానసిక ప్రశాంతత సాధ్యమౌతుందన్నారు.

మనిషిగా పుట్టడమే మహాద్భుతమన్నారు.. సద్గురు జగ్జీ వాసుదేవ్. మానవత్వానికి పరిధులు లేవన్నారు. 112 అడుగుల ఆడుగుల ఆదియోగి విగ్రహ తయారీకి రెండున్నరేళ్లు పడితే.. ముఖాకృతి డిజైన్ చేసేందుకు 8 నెలలు పట్టిందన్నారు. వచ్చే ఏడాది శివరాత్రి నాటికి 10 కోట్ల మందికి యోగా శిక్షణ ఇస్తామన్నారు జగ్గీ వాసుదేవ్.

ఆదియోగి విగ్రహావిష్కరణకు దేశవ్యాప్తంగా ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర గవర్నర్,తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, తమిళనాడు సీఎం పళనిసామి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈశా ఫౌండేషన్ యోగా సెంటర్ తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో ఉండటం.. తీవ్రవాదులు, మావోల ప్రాబల్య ప్రాంతం కావటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల పరిధిలో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy