ఆదియోగి విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ

aadiyogiప్రపంచంలోనే అతిపెద్ద ముఖం ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. కోయంబత్తూరులో వున్న ఈషా యోగా కేంద్రంలో జరగనున్న మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొంటున్న ఆయన.. ఈ సందర్భంగా ఆయన 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి మహాశివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని ఐదంచెల భద్రత ఏర్పాటైంది. వేడుకలు జరిగే ప్రాంతం చుట్టూ కొండలు వుండడంతో 15 కిలోమీటర్ల దూరానికి నిఘాను పటిష్టం చేశారు. ఇందుకోసం మొత్తం 5 వేల మంది పోలీసులను నియమించారు. అదే విధంగా కోయంబత్తూరు విమానాశ్రయాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అదేవిధంగా కోయంబత్తూరు నగరంలో శుక్రవారం వాహనాల రాకపోకలను కూడా ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.

విగ్రహ ముఖాన్ని స్టీల్‌తో తయారు చేశారు. ముఖాకృతి డిజైన్‌ చేసేందుకు రెండున్నర సంవత్సరాలు పట్టగా ఎనిమిది నెలల పాటు శ్రమించి దీన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు.

నాలుగు దిక్కుల్లోను ఆదియోగి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈషా ఫౌండేషన్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాన కోయంబత్తూర్‌లో మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. తూర్పున వారణాసి, ఉత్తరాన దిల్లీ, పశ్చిమ దిక్కున ముంబయిలోను ఆదియోగి విగ్రహాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు సద్గురు వెల్లడించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy