ఆదివాసీలకు స్పెషల్ యాప్

Tribal-appగిరిజనుల కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. తండాలో నివశించే ఆదివాసీ గిరిజనులతో నిత్యసబంధాలు పెంచుకోవటానికి స్పెషల్ గా ట్రైబల్ డైరీస్ యాప్ ను ప్రవేశపెట్టనుంది సెంట్రల్ గవర్నమెంట్. మే చివరి వారంలో ఈ యాప్.. ఆదీవాసీలకు అందుబాటులోకి వస్తుందంటున్నారు అధికారులు.

అటవీ ప్రాంతాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న భూమి సమస్యలు, పాలనా పరమైన సమస్యలు, సామాజిక, విద్య, వైద్య సేవల్లో లోపాలుంటే ఈ యాప్ ద్వారా డైరెక్టుగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీకి తెలియజేయవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా.. కౄర మృగాల మధ్య నివశిస్తుంటారు. హాస్పిటల్స్, స్కూళ్ల కోసం గిరిజన బాల, బాలికలు కిలోమీటర్ల దూరం నడకదారిన అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. వీళ్లకు రోడ్లు, ప్రయాణ వాహనాలు అందుబాటులో ఉండవు. విషపు జీవాల బారిన పడి ఏడాదికి వందల మంది గిరిజనులు చనిపోతున్నారు.

సమాజానికి దూరంగా ఉండే ప్రజలతో సత్సంబంధాలను మెరుగు పర్చుకోవాలని అధికారులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. వీళ్లకు సరైన వైద్యసేవలు, విద్య అందడం లేదు. వీటిని అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవతో ట్రైబల్ డైరీస్ యాప్ ను అభివృద్ధి చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మంది గిరిజనులు.. తమ సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వానికి ట్రైబల్ డైరీస్ యాప్ ద్వారా.. వీడియో, ఫోటోలు, మెసేజ్ లతో వాళ్ల సమస్యలను గిరిజన మంత్రిత్వ శాఖకు నేరుగా తెలియజేస్తే.. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ వెంటనే రంగంలోకి దిగుతుంది. గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు సబంధింత శాఖాధికారులు.

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy