ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీతారాంనాయక్

sita-ram-naik

లంబాడీ ఉద్యోగస్తులకు ప్రభుత్వం భద్రత కల్పించాలన్నారు లంబాడీ నేతలు. హైదరాబాద్ సరూర్ నగర్ లోని గ్రౌండ్ లో లంబాడీల శంఖారావం సదస్సు జరిగింది. ఆలిండియా బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు.. లంబాడీ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లంబాడీ ఐక్య వేదిక నాయకులు పాల్గొన్నారు.  వీరితో పాటు పెద్ద ఎత్తులో లంబాడీ జనం తరలివచ్చారు.

ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఎంపీ సీతారాం నాయక్. కొంతమంది రాజకీయ లబ్ది కోసం ఆదివాసీలు, లంబాడీల మధ్య విషప్రచారాలు కల్పిస్తున్నారన్నారు. 1975 నుండి ఇక్కడే ఉన్నా తమను మైగ్రేటెడ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. క్రిమీలేయర్ ద్వారా ట్రైబల్ యాక్ట్ తీసుకొచ్చారన్నారు. 25 లక్షల మందిమి ఉన్నామని, 30 నుండి 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించగల దమ్ము తమకుందన్నారు. ఒకటి రెండు శాతం లేని వాళ్ళు… 50 శాతం ఉన్నవాళ్లను శాషిస్తున్నారంటూ రాబోయే రోజుల్లో దేశంలో రిజర్వేషన్లకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు సీతారాంనాయక్‌.

అన్నదమ్ములుగా కలిసి ఉందమని పిలుపునిచ్చిన లంబాడీ నేతలు…జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సమస్యలపై బహిరంగ వేదికలపై చర్చలకు తాము సిద్ధమన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy