ఆదివాసీ జాతరల్లోనే ప్రపంచం మెచ్చిన మేడారం

Special-Story-On-Tribal-Festivalsమనదేశంలో చాలా ఆదివాసీ జాతరలున్నాయి. వాటిలో ఏడాదికి, రెండుమూడేళ్లకు జరిగేవి ఉన్నాయి. ఆదివాసీలే పూజారులుగా ఆలయాలు ఉన్నాయి. చాలా జాతరలలో కాలంతో పాటు మార్పులొచ్చాయి. వీటిలో దండకారణ్యంలో, గోదావరి తీరానికి వెంట ఉన్న ప్రాంతాల్లో జరిగేవి చాలా ఉన్నాయి. అన్నిటిలోనూ మేడారం జాతర దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ఆదివాసీల జాతరలు చిన్నవి పెద్దవి కలిపి డజనుకు పైనే ఉన్నాయి. వాటిలో చత్తీస్ గఢ్ లో దంతేశ్వరి జాతర, మహారాష్ట్రలో కాళీ కంకాలమ్మ జాతర, ఆదిలాబాద్ లో నాగోబా జాతర, వరంగల్ లో నాగులమ్మ జాతర, ముసలమ్మ జాతర, ముత్యాలమ్మ జాతర లాంటివి చాలా ఉన్నాయి.

ఆదివాసీల జాతరలు తమ కుటుంబాలు బాగుండాలని, అడవి పచ్చగా ఉండాలని జరుపుకుంటారు. గోదావరి తీరానికి అవతల ఉన్న దంతేశ్వరి ఆలయాన్ని 14వ శతాబ్దంలో కాకతీయులే కట్టినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా దసరా రోజున పెద్ద జాతర జరుగుతుంది. ఆదివాసీలు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటారు. సమ్మక్క పూర్వికులు చత్తీస్ గఢ్ నుండే తెలంగాణ ప్రాంతానికి వచ్చారన్న కథనం ఉంది.

సమ్మక్క రూపంతోనే అక్కడ కాకతీయ ప్రభువులు దంతేశ్వరి ఆలయం కట్టించారని కూడా చెబుతారు. కోయలు ఎక్కువ మంది వచ్చే ఆలయాల్లో ఇదొకటి. ఆదివాసీల దేవతల్లో చాలావరకు మహిళలే కావడం విశేషం. చారిత్రక నేపథ్యం, భక్తుల రాక ఆధారంగా చూసినా దేశంలోనే పెద్ద జాతరగా మేడారం నిలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో క్లిక్ చేయండి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy