ఆధార్ చంపేసింది.. రేషన్ దొరక్క ఆకలి చావు

adhhar-akaliఅంతర్జాతీయ ఆహార దినోత్సవం రోజున.. ఆకలికేకలు తట్టుకోలేక ఓ చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన జార్ఖండ్ లో చోటు చోసుకుంది. ఆ ఆకలిచావుకు ఆధార్ కారణం కావడం మరో విషాదం. రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం చేయకపోవడంతో రేషన్ దొరకలేదు. అలా 15 రోజులుగా పస్తులు ఉంటూ వచ్చిన ఆ చిన్నారి సోమవారం ప్రాణాలు  కోల్పోయింది.

ఒకవైపు సంక్షేమ పథకాలకు ఆధార్‌ నెంబరు అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు చెబుతుంటే.. మరోవైపు ప్రభుత్వం ఆధార్‌తో అనుసంధానించని వారిని సంక్షేమ పథకాలకు దూరం చేస్తోంది. దీనిపై స్వచ్ఛంద సంస్థలు భగ్గుమంటున్నాయి.

వివరాల్లోకి వెళితే.. సిమ్దేగా జిల్లా కరిమతి అనే గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం తన రేషన్‌ కార్డుకు ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసుకోలేపోయింది. దీంతో ఆ కుటుంబానికి సబ్సిడీ బియ్యం ఇచ్చేందుకు రేషన్‌ డీలరు నిరాకరించాడు. ఫలితంగా పక్షం రోజులుగా తినడానికి తిండి లేక ఆ కుటుంబ సభ్యులు ఆకలితో అలమటిస్తున్నారు. 11ఏళ్ల సంతోషి కుమారికి పాఠశాలలో ఇచ్చే మధ్యాహ్న భోజనమే దిక్కైంది. పాఠశాలకు సెలవు ఉంటే అదీ అందని దుస్థితి. ఇటీవల వారం రోజులుగా భోజనానికి నోచుకోని సంతోషి ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు విడిచింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy