ఆధ్యాత్మిక గురువు-పదివేల కోట్ల ఆస్తి

vbk-23-asaram_jpg_1594589fఆయన ఓ ఆధ్యాత్మిక గురువు. పది వేల కోట్ల ఆస్తులకు అధిపతి. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా. అవునూ ఆశారాం బాపు ఆస్తులు అక్షరాల 10 వేల కోట్లు. ఆయన ఆశ్రమంలో సోదాలు నిర్వహించిన సూరత్ పోలీసుల విచారణలో తెలిసింది. ఈ ఆస్తులు కేవలం ఆయన ఆశ్రమంలో లభించిన ఆధారంగా మాత్రమే…మరీ విచారణ పూర్తయ్యే నాటికి స్వామివారి ఆస్తి ఎంతకు చేరుకుంటుందో. కుబేరుడి కళ్లు తిరిగేలా..కార్పోరేట్లకే అసూయ పుట్టేల ఆస్తులు కూడ బెట్టారు ఆశారాం బాపూజీ. లైగింక వేధింపుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఆశారాం బాపు ఆస్తులపై సూరత్ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. పోలీసు విచారణలో రోజుకో నిజం బయటపడుతోంది.ఇప్పటి వరకు లెక్కించిన ఆస్తి విలువ 10 కోట్లు ఉంటుందని సూరత్ పోలీసులు అంచనా వేస్తున్నారు.దేశ వ్యాప్తంగా స్వామివారికి  ఉన్న భూములను కలపకుండానే ఇంత ఆస్తి ఉందంటున్నారు పోలీసులు.ఆయన ఆశ్రమపై దాడులు చేసిన పోలీసులకు కళ్లు చెదిరే డాక్యమెంట్లు లభించాయి.బ్యాంకు ఖాతాలు,షేర్లు డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లతో కలిపి ఆశారాం ఆస్తుల విలువ 10 వేల కోట్లు. మరిన్ని డాక్యమెంట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని …..అప్పుడు ఆస్తుల విలువ మరింత పెరగే అవకాశం ఉందంటున్నారు సూరత్ పోలీసులు.కొన్ని నెలల క్రితం ఆయన ఆశ్రమంలో సోదాలు చేసిన పోలీసులు 40 సంచుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా గుజరాత్ లోని 40 ప్రాంతాల్లో,రాజస్థాన్,ఏపీ మధ్యప్రదేశ్ లో కూడా ఆస్తులు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ఏమైనా ఆశారాం డాంక్యుమెంట్లు దాచిపెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy