మొత్తం 16,384 ఎక్స్‌‌ప్రెషన్స్‌.. మనం పలికేవి కేవలం 35 మాత్రమే!

చాలా చాలా ఆనందంగా ఉందా..? అయితే, ఆ ఆనందాన్ని ఎన్ని రకాలుగా చూపించగలరు..? దాదాపు 17 రకాలుగా ఆనందాన్ని వ్యక్తపరచొచ్చని అమెరికా ఒహయో స్టేట్‌ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16,384 ఎక్స్‌‌ప్రెషన్స్‌‌లో మనం పలుకుతున్న భావాలు కేవలం 35. ఉదాహరణకు చిరాకును కేవలం ఒకే ఒక్క ఎక్స్‌‌ప్రెషన్‌‌లో చూపించగలమట. చిన్న సంతోషం నుంచి ఆపుకోలేనంత ఆనందం వరకు దాదాపు 17 రకాల భావాలను మన మొహం పలికించగలుగుతుందట. భయాన్ని మూడు రకాలుగా, ఆశ్చర్యాన్ని నాలుగు పద్ధతుల్లో, కోపం, బాధను ఐదు చొప్పున ఎక్స్‌‌ప్రెషన్స్‌‌లో చూపిస్తామట. ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాలకు చెందిన 72 లక్షల మంది మొహాలను కంప్యూటర్‌ అల్గారిథం ద్వారా పరీక్షించి 16,384 భావాలను మనిషి వ్యక్తీకరించగలడని సైంటిస్టులు తేల్చారు. 821 ఇంగ్లీష్‌ పదాల ఆధారంగా ఆ ఎమోషన్స్‌‌ను ఎలా పలుకుతారో గుర్తించారు. ప్రొఫెషనల్‌ అనువాదకులతో ఇంగ్లీష్‌ పదాలను వివిధ భాషల్లోకి తర్జుమా చేసి మరీ ఈ ప్రయోగం చేశారు.

One Response to మొత్తం 16,384 ఎక్స్‌‌ప్రెషన్స్‌.. మనం పలికేవి కేవలం 35 మాత్రమే!

  1. Babu Sadimela says:

    https://youtu.be/b3LUS4574as Please details for vizag raja Babu ornamental fisheries resort address

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy