ఆనంద్ తో ఇషా అంబానీ నిశ్చితార్థం

ishaambaniరిలయన్స్ అధినేత ముఖేష్  అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్, ఈషా మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. ఆనంద్‌, ఇషాలు స్నేహితులు. కొద్దిరోజుల క్రితం మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఆనంద్‌, ఇషాకు ప్రపోజ్‌ చేశారు. ఇషా కూడా అంగీకారం తెలపడంతో అక్కడే ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత వారి వారి కుటుంబాలకు విషయం చెప్పారు. ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాల మ్యారేజ్ కంటే ముందే ఆనంద్‌, ఇషాల వివాహం జరుగుతుందని తెలిసింది. అయితే..పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు.

ఆనంద్‌ భారత్‌లో పిరామల్‌ ఈ-స్వాస్థ్య, పిరామల్‌ రియాల్టీ అనే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్నారు. ఇషా రిలయన్స్ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో సభ్యురాలిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy